సినిమా రిలీజై మంచి విజయం సాధించిన ఆనందంలో నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు కార్లను బహుమతిగా ఇవ్వడం మామూలే. ఇటీవల ‘బేబి’ అనేే చిన్న సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్కేఎన్ ఖరీదైన కారు బహుకరించడం తెలిసిందే. ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిన ఆనందంలో ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ అయితే హీరో, దర్శకుడే కాకుండా సంగీత దర్శకుడికి కూడా లగ్జరీ కార్లు బహుకరించాడు.
ఐతే రిలీజ్ తర్వాత ఇలా లగ్జరీ కార్లు ఇవ్వడం పాత ట్రెండు కాగా.. ఒక సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల కారును బహుమతిగా అందుకోవడం సెన్సేషన్ అనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగ ఈ ఘనతను అందుకున్నట్లు సమాచారం. అతడి కొత్త సినిమా ‘యానిమల్’ వచ్చే నెల ఒకటో తారీఖున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆల్రెడీ సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’తో లాభాల పంట పండించుకున్నాడు నిర్మాత భూషణ్ కుమార్. ‘యానిమల్’ విడుదలకు ముందే దాన్ని మించి ఆయనకు లాభాలు అందించిందట. భారీ హైప్ మధ్య సినిమా రిలీజ్ కాబోతోంది. మంచి టాక్ వస్తే ఓవర్ ఫ్లోస్‌తో మరింతగా భూషణ్‌కు లాభాలు రావడం ఖాయం. సందీప్ వల్లే భారీగా ఆదాయం అందుకున్న భూషణ్.. సినిమా మీద పూర్తి నమ్మకంతో ముందే అతడికి లగ్జరీ కారును బహుమతిగా అందించాడట.
ఆ కారు విలువ రూ.5 కోట్లు కావడం బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఇంత ఖరీదైన కారును బహుశా ఏ దర్శకుడూ గిఫ్ట్ కింది అందుకుని ఉండడు. అది కూడా విడుదలకు ముందే కావడం బాలీవుడ్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం సందీప్ రెడ్డి రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. డిసెంబరు 1న ‘యానిమల్’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 10, 2023 9:24 am
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…