ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్లు గతంలోనే చూశాడు కానీ ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలు మాత్రం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని తెరకెకెక్కించిన తీరు చాలా నెగటివిటీని తీసుకొచ్చింది. పాత్రధారుల మీద వచ్చిన కంప్లయింట్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. ఇంత ఫ్లాప్ అయినా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రావడంలో డార్లింగ్ బ్రాండ్ చాలా పని చేసింది. ఒకవేళ అంచనాలకు తగ్గట్టు కనక ఆదిపురుష్ వచ్చి ఉంటే దశాబ్దాల తరబడి ఒక ఐకానిక్ మూవీగా తరతరాలు చెప్పుకునేవాళ్ళు. ఛాన్స్ మిస్ అయ్యింది.
ఇంత జరిగినా ఆదిపురుష్ బుల్లితెరపై మాత్రం అదరగొట్టింది. గత నెలాఖరున వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేస్తే టిఆర్పి అర్బన్ 9.47 నమోదు చేయగా అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 8.41 తెచ్చుకుంది. బాక్సాఫీస్ ఫలితంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద నెంబర్. ఎందుకంటే ఈ ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన వాల్తేరు వీరయ్యకు వచ్చింది కేవలం 5.14. దానికన్నా వీరసింహారెడ్డి ఎంతో మెరుగ్గా 8.83 సాధించింది. ఈ రెండూ ఘనవిజయం సాధించినవే. వీటికన్నా ఆదిపురుష్ ఎక్కువ రేటింగ్ సెట్ చేయడం నిజానికి అభిమానులు సైతం ఊహించలేదు.
దీన్ని బట్టి రాముడి సెంటిమెంట్, ప్రభాస్ ఇమేజ్ మన తెలుగు జనాల్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి నెలలు దాటేసింది. వివిధ మార్గాల్లో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. అయినా కూడా ఇంత రేటింగ్ రావడం విశేషమే అది కూడా తెలుగు వెర్షన్ కు మాత్రమే. ఇది చూసి సంబరపడటం కాదు కానీ ఏదో కాసింత ఊరట కలిగేలా అభిమానులు సంతోష పడుతున్నారు. దీనికే ఇలా ఉంటే ఒకవేళ ప్రభాస్ కు సరైన సినిమా కనక పడితే టిఆర్పి టాప్ రాంక్ లో ఉన్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరులను దాటడం పెద్ద కష్టమేమీ కాదు.
This post was last modified on November 9, 2023 4:24 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…