శంకర్-రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ మీద మెగా అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగకపోవడం, రిలీజ్ ఆలస్యం అవుతుండటం అభిమానులకు కొంత నిరాశ కలిగించినా.. దీని హైప్ మాత్రం తక్కువగా లేదు. ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద విశేషం ఏంటంటే.. ఇది శంకర్ సొంతంగా రాసిన కథ కాదు. అలా అని ఆయన తనతో పని చేసే రచయితల మీదా ఆధారపడలేదు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
శైలి పరంగా చూస్తే వీళ్లిద్దరూ భిన్నమైన సినిమాలు చేస్తుంటారు. వెరైటీ ఐడియాలతో కథలు అల్లే కార్తీక్ శంకర్ సినిమాకు కథ అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఏ పరిస్థితుల్లో శంకర్ కోసం ‘గేమ్ చేంజర్’ కథ ఇచ్చాడనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు కార్తీక్.
తన కొత్త చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ ‘గేమ్ చేంజర్’ విశేషాలు పంచుకున్నాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పొలిటికల్ కథ రాశానని.. అది ఒక షేప్ తీసుకున్నాక తన అసిస్టెంట్లకు చెబితే.. ఇది శంకర్ సినిమా లాగా పెద్ద స్థాయిలో కనిపిస్తోందిన అభిప్రాయపడ్డారని కార్తీక్ తెలిపాడు. తన కెరీర్లో ఇంకా అంత పెద్ద స్థాయి పొలిటికల్ మూవీ తీసే రేంజికి రాలేదని.. అందుకే ఈ కథను శంకర్‌కు ఇవ్వాలనిపించిందని.. ఆయన్ని సంప్రదించానని కార్తీక్ తెలిపాడు.
ఒక పెద్ద హీరోతో శంకరే ఈ సినిమా తీస్తే బాగుంటుందని అనిపించిందని.. ఆయన రామ్ చరణ్‌కు హీరోగా ఎంచుకున్నారని కార్తీక్ తెలిపాడు. కేవలం కథ మాత్రమే తను ఇచ్చానని.. దానికి స్క్రీన్ ప్లే అంతా శంకరే చేసుకున్నాడని.. తన కథ తెరపైకి ఎలా వస్తుందో చూడాలని తనకు కూడా చాలా క్యూరియాసిటీ ఉందని కార్తీక్ తెలిపాడు.
This post was last modified on November 8, 2023 10:47 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…