పుష్ప 1 వచ్చి రెండేళ్లవుతున్నా దాని తాలూకు ప్రభావం నార్త్ ఆడియన్స్ లో బలంగా ఉంది. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రిటీలోనూ ఈ ఫీవర్ కనిపిస్తోంది. తాజాగా ఈ లిస్టులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేరారు. ఇటీవలే జరిగిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎపిసోడ్ లో పార్టిసిపెంట్ గా వచ్చిన ఓ గృహిణికి 20 వేల రూపాయల ప్రశ్న అడిగారు. 2023 సంవత్సరం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్న హీరో ఎవరు అని ఆప్షన్లు ఇస్తే ఠక్కున ఆవిడ బన్నీ పేరు చెప్పేసి సొమ్ము గెలిచేసుకుంది. ఈ సందర్భంగానే అమితాబ్ పుష్ప గురించి కొన్ని గూస్ బంప్స్ మాటలు చెప్పారు.
పుష్ప చాలా గొప్ప సినిమా అని, కాలికి వేసుకున్న చెప్పు జారిపోతే దాన్ని కుంటుకుంటూ హీరో వేసుకోవడం ఒక స్టెప్పుగా మారడం జీవితంలో మొదటిసారి చూశానని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీవల్లి పాటలో ఒక కొండ మీద ఈ షాట్ వచ్చే సంగతి తెలిసిందే. అంత ప్రత్యేకంగా ఆ బిట్టునే గుర్తుపెట్టుకుని మరీ బిగ్ బి పంచుకోవడం చూస్తే ఆయన ఎంతగా అందులో లీనమై చూశారో అర్థమవుతుంది. బన్నీ అద్భుతంగా నటించాడనే కితాబుతో పాటు వచ్చిన ఫ్యాన్స్ తో టీమ్ కు చప్పట్ల రూపంలో అభినందనలు తెలియజేశారు. దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది.
దీన్ని బట్టే పుష్ప రీచ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద ఆల్రెడీ ఓ రేంజ్ అంచనాలున్నాయి. మైత్రి నిర్మాతలు ఇంకా బిజినెస్ ని మొదలుపెట్టలేదు. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటిటి హక్కుల మీద కనివిని ఎరుగనంత రేంజ్ లో ధరలు పలుకుతాయనే ఉద్దేశంతో వేచి చూస్తున్నారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి తర్వాత ఒప్పందాల పర్వం మొదలు కాబోతోంది. ప్రస్తుతం భారీ ఎత్తున వందలాది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో జాతర్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్న సుకుమార్ వేసవిలోగా గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on November 8, 2023 8:19 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…