ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ ఒకేసారి రూపొందుతున్న సంగతి తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి రావడంతో రామ్ చరణ్ సంవత్సరాల తరబడి సమయాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. సరే జరిగిందేదో జరిగింది బెస్ట్ వస్తే చాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చి పడింది. ఇండియన్ 3 ఉందో లేదో అనే అనుమానాలకు చెక్ పెడుతూ కమల్ హాసన్ స్వయంగా తన పుట్టినరోజు వేడుకలో క్లారిటీ ఇచ్చేశారట. రెండు తర్వాత మూడో భాగం రిలీజయ్యాకే మిగిలిన సినిమాలు వస్తాయని కుండ బద్దలు కొట్టారు.
అసలు ట్విస్టు ఏంటంటే ఇండియన్ 2కి సంబంధించి మొత్తం 6 గంటల ఫుటేజ్ ని తీశారట. దీంట్లో ఒక అరగంట కత్తిరించినా మిగిలిన దాన్ని నీట్ గా ఎడిటింగ్ చేసుకుని రెండు భాగాలుగా రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొంత భాగం షూటింగ్ చేసి ఫైనల్ కట్ కి సిద్ధం చేసుకోవాలి. నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ గతంలో ఈ విషయాన్ని చూచాయగా చెప్పినా నిర్ధారణగా చెప్పకపోవడంతో స్పష్టత రాలేదు. ఇప్పుడు కమల్ స్వయంగా క్లూస్ ఇవ్వడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సంగతేంటని మెగా ఫ్యాన్స్ అడిగితే సమాధానం ఎవరి దగ్గరా లేదు.
వచ్చే ఏడాది వేసవి లోగా శంకర్ కమల్, చరణ్ ఇద్దరివీ పూర్తి చేసి ఫ్రీ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. తర్వాత రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ చేయాల్సి ఉంది. దాన్నెప్పుడో అఫీషియల్ గా ప్రకటించారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా తీస్తారో లేదో తెలియదు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ విడుదల తేదీలు మాత్రం ఇప్పట్లో తేలే సూచనలు లేవు. చెన్నై వర్గాల ప్రకారం ఇండియన్ 2 ని వేసవిలో రిలీజ్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమాచారం ఉందట. అధికారికంగా 2024 సంక్రాంతికి ఒక కొత్త టీజర్ తో ప్రకటించే అవకాశం ఉంది. ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on November 8, 2023 8:13 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…