Movie News

బాలయ్య మాస్‌కు త్రివిక్రమ్ క్లాస్ టచ్

నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయన సినిమాలో భాగస్వామిగా మాత్రం మారుతున్నాడు.

‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. అంటే నేరుగా త్రివిక్రమ్ పేరు నిర్మాతగా పోస్టర్ మీద పడటం లేదు కానీ.. ఆయన భార్య సాయి సౌజన్య ఆధ్వర్యంలో మొదలైన ‘ఫార్చ్యూన్ ఫోర్’ సంస్థకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉండటం విశేషం. అంటే త్రివిక్రమ్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరన్నమాట. 

తాను నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమా అంటే స్క్రిప్టు, మేకింగ్ విషయంలో ఎంతో కొంత త్రివిక్రమ్ టచ్ ఉండకపోదు. ఆ సంకేతాలు ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్లోనే కనిపించాయి. ఈ పోస్టర్ చూస్తే.. మాస్ టచ్ ఉంటూనే స్టైలిష్‌గా ఉండే సినిమాలా కనిపిస్తోంది ఎన్‌బీకే 109. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ పోస్టర్‌ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’ అంటూ ఈ పోస్టర్ మీద క్యాప్షన్ పెట్టారు.

గొడ్డలికి కళ్లజోడు తొడిగించి ఆ కళ్లజోడులో రౌడీలు ఎగురుతున్న దృశ్యం కనిపించేలా పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ఈ సెటప్ అంతా చూస్తే ఇదొక వయొలెంట్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది. పోస్టర్ మీద హీరో, డైరెక్టర్, నిర్మాతల పేర్లు తప్ప వేరే సాంకేతిక నిపుణుల వివరాలు లేవు. ఈ మధ్య బాలయ్యకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన తమనే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తాడని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం. బాలయ్య నెవర్ బిఫోర్ గెటప్‌లో కనిపించనున్నాడట ఈ చిత్రంలో.

This post was last modified on November 8, 2023 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago