Movie News

ఎస్.జె.సూర్య క్రేజ్ మీదే ఆడాలి

పదేళ్లు వెనక్కి వెళ్తే.. ఎస్.జె.సూర్యను అందరూ ఒక దర్శకుడిగానే చూసేవాళ్లు. అప్పటికే నటుడిగా తన స్వీయ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినప్పికీ.. తనలో ఒక విలక్షణమైన నటుడు ఉన్నాడని ఎవరూ గుర్తించలేదు. కానీ తమిళంలో ‘ఇరైవి’ సహా కొన్ని చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డిజాస్టర్ అయిన ‘స్పైడర్’లో సూర్య చేసిన విలన్ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తమిళంలో మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రతో అతను అలరించాడు.

‘మానాడు’ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంలో సూర్య పాత్ర కీలకం. ఇక వినాయక చవితి టైంలో వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ ఏకంగా వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసిందంటే అందులో సూర్యది మేజర్ రోల్. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య విజృంభించి నటించాడు. సినిమాను తన భుజాల మీద మోశాడు. ఆ సినిమా తెలుగులో కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిందంటే సూర్య ఆకర్షణ వల్లే.

సూర్యకు ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందంటే.. అతడికి పది కోట్ల పారితోషకం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవలే నాని సినిమాకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చే అతణ్ని తీసుకున్నారు. దీపావళి వీకెండ్లో రానున్న ‘జిగర్ తండ డబులెక్స్’ సినిమాకు కూడా ప్రధాన ఆకర్షణ సూర్యనే. ఇందులో రాఘవ లారెన్స్ మరో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ లారెన్స్ సినిమాలంటే కొన్నేళ్ల నుంచి జనాలు భయపడి పోయే పరిస్థితి వచ్చింది.

అతను చేసే రొడ్డ కొట్టుడు మాస్ సినిమాలు జనాల్ని బెంబేలెత్తించేస్తున్నాయి. ‘జిగన్ తండ డబులెక్స్’లో లారెన్స్ పాత్ర విభిన్నంగానే అనిపిస్తున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని క్యారీ చేయాల్సింది సూర్యనే అని భావిస్తున్నారు. ఒక క్రేజీ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమిళంలో మంచి హైపే ఉంది. తెలుగులో సురేష్ బాబు, ఏషియన్ సునీల్ లాంటి పెద్ద నిర్మాతలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సినిమాకు ఓపెనింగ్స్  తీసుకొచ్చేది సూర్యనే అనడంలో సందేహం లేదు. మన దగ్గర కూడా తన క్రేజ్ అలా ఉంది మరి. తన పాత్ర, పెర్ఫామెన్స్ క్లిక్ అయితే ఈ సినిమా హిట్ అయినట్లే.

This post was last modified on November 7, 2023 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

1 hour ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

2 hours ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

3 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago