Movie News

రష్మికకు మద్దతుగా వేలాది గొంతుకలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీని వాడుకుని ఒక ఫేక్ వీడియోని రష్మిక మందన్నకి ఆపాదించి వైరల్ చేయాలని చూసిన వైనం భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలిస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ పిలుపునివ్వడంతో ఈ వివాదం చాలా దూరం వెళ్లిపోయింది. బాలీవుడ్ డెబ్యూ గుడ్ బైలో ఈయన కూతురిగా రష్మిక మందన్న నటించిన కారణంగా ఆ బంధంతో బిగ్ బి స్పందించారు. ఇప్పుడు క్రమంగా ఆ సంఖ్య పదులు వందల నుంచి వేలు దాటే స్థాయికి చేరుకుంటోంది.

సినిమా తారలు కాబట్టి ఇలాంటి ఆటుపోట్లు ఎన్ని చూసి పుకార్లతో విసిగి వేసారి రాటుదేలిపోయి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఘటనే ఒక మధ్య తరగతి అమ్మాయికి జరిగితే తనతో పాటు తల్లితండ్రులు తట్టుకోగలరా. ఏదైనా అఘాయిత్యం జరిగితే ఎవరిది బాధ్యత. అసలు వీడియోలు సృష్టిస్తున్నదెవరో త్వరగా పసిగట్టలేని వ్యవస్థలో, ఒకవేళ పట్టుకున్నా సులభంగా బెయిలు మీద బయటికి వచ్చే చట్టాల్లో పరిష్కారం ఎక్కడుంది. ఇదే సగటు సామాన్యులు ఆన్ లైన్ వేదికగా సంధిస్తున్న ప్రశ్న. చదువుకోని, సాంకేతిక విషయాల పట్ల అవగాహన లేని సామాన్యులు ఇవన్నీ నిజమే అనుకుంటారుగా.

రష్మికకు జరిగిన దాన్ని ఖండిస్తూ నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, ప్రియా సర్కార్, ఆయుష్ జైన్, అనురాగ్ మీనా, బిఆర్ఎస్ నాయకురాలు కవిత కల్వకుంట్ల తదితరులు ట్వీట్లు చేశారు. అయితే దీన్ని తప్పని చెప్పే క్రమంలో చాలా మంది ఆ వీడియోని మళ్ళీ షేర్ చేయడంతో అప్పటిదాకా అసలీ విషయమే తెలియని వాళ్లకు కూడా వీడియో రీచ్ అవుతోంది. ఇది ఒకరకంగా మంచిదే అయినా ఇంకో కోణంలో చూస్తే రష్మికకి ఇబ్బంది తెచ్చేదే. కేంద్ర  మంత్రిత్వ శాఖ సైతం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడే ఇలా ఉంటే ఈ ఏఐ టెక్నాలజీ ఫ్యూచర్ లో ఇంకెన్ని విపరీతాలు తీసుకొస్తుందో 

This post was last modified on November 7, 2023 5:54 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

9 hours ago