మా ఊరి పొలిమేర.. కరోనా టైంలో నేరుగా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైన సినిమా. ఆ చిత్రం మొదలుపెట్టి కాసేపు చూస్తే.. ఇదేం సినిమారా బాబూ అనిపిస్తుంది. చేతబడుల చుట్టూ కథను నడిపిస్తూ.. పాత్రలతో పచ్చి బూతులు మాట్లాడిస్తూ.. కొన్ని శృంగార సన్నివేశాలను హద్దులు దాటించి.. ఇదొక బి-గ్రేడ్ మూవీ అనే ఫీలింగ్ కలిగిస్తారు. కానీ మొత్తం సినిమా చూశాక అభిప్రాయం మారుతుంది.
ముఖ్యంగా సత్యం రాజేష్ పాత్ర చిత్రణ.. కథలోని మలుపులు.. ఒళ్లు గగుర్పొడిచే కొన్ని సీన్లు.. డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తాయి. ఏ పబ్లిసిటీ లేకపోయినా మౌత్ టాక్‌తోనే ఈ సినిమా హాట్ స్టార్‌లో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ఆ ఓటీటీలో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ వచ్చిన స్పందన చూసే.. ‘మా ఊరి పొలిమేర-2’ను కొంచెం పెద్ద బడ్జెట్లో థియేట్రికల్ రిలీజ్ లక్ష్యంగా తీసింది చిత్ర బృందం.
ఈసారి కథ విస్తృతి పెంచారు. క్వాలిటీ కూడా పెరిగింది. బూతులు, శృంగార సన్నివేశాలు లేకుండా థియేటర్లలో చూడదగ్గ ఫీచర్ ఫిలిం లాగా దీన్ని మలిచారు. బన్నీ వాసు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో దీనికి మంచి రిలీజ్ కూడా దక్కింది. రిలీజ్‌కు ముందు అందరి దృష్టీ ‘కీడా కోలా’ మీదే ఉండగా.. ఓ మోస్తరు హైప్‌తో రిలీజైన ఈ సినిమా.. విడుదల తర్వాత సంచలనం రేపుతోంది. తొలి రోజు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమాకు కనిపించిన ఆక్యుపెన్సీలు చూసి షాకయ్యారు ఇండస్ట్రీ జనాలు. ‘కీడా కోలా’ సందడి తొలి రోజుకే పరిమితం కాగా.. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడి చల్లబడిపోయింది. కానీ ‘మా ఊరి పొలిమేర-2’ మాత్రం నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.
ఆ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. ఇందులోని ట్విస్టులు, థ్రిల్స్ టార్గెటెడ్ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. అందుకే మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమా మీద పెట్టిన ఖర్చంతా ఒక్క నైజాం ఏరియా నుంచే వచ్చేయడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టేసింది. ఫుల్ రన్లో ఈజీగా పది కోట్ల షేర్ మార్కును దాటేసేలా ఉంది ‘పొలిమేర-2’. ఈ సక్సెస్ మూడో పార్ట్‌కు మరింత ఊపునిచ్చేదే. దాన్ని మరింత పెద్ద రేంజిలో, ఇంకా ఉత్కంఠభరితంగా తీస్తే పెద్ద సక్సెస్ అవడం ఖాయం.
This post was last modified on November 7, 2023 2:50 pm
కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ ఖలేజాకు తర్వాతి కాలంలో కల్ట్ ఫాలోయింగ్ దక్కింది. ముఖ్యంగా టీవీ ఛానల్స్, ఓటిటిలో…
గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ… నాటి భూ రికార్డుల…
రమణ (ఠాగూర్ మాతృక), గజిని, హిందీ గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్లలో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనతో ప్రజలు, పారిశ్రామిక వేత్తలు…
తాజాగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పార్టీని పరుగులు పెట్టించాలని.. పార్టీ…
టాలీవుడ్లో హీరోల రేంజిని బట్టి స్టార్, సూపర్ స్టార్ అని విభజించి మాట్లాడేవారు. చిన్న, పెద్ద, మిడ్ రేంజ్ అనే…