ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ అనే పదానికి దూరమైన లోకనాయకుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ రూపంలో తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుని తనలో చేవ ఇంకా అలాగే ఉందని నిరూపించారు. తెలుగులోనూ ఇది అనూహ్యంగా సక్సెస్ సాధించడంతో కమల్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడా సంతోషాన్ని రెట్టింపు చేసేలా మూడు దశాబ్దాల తర్వాత దర్శకుడు మణిరత్నంతో చేతులు కలపడమే కాక అతి తక్కువ టైంలోనే టైటిల్ ని డిసైడ్ చేయడంతో పాటు దానికి సంబంధించిన మూడు నిమిషాల వీడియో టీజర్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేయడం విశేషం.
కథ గురించి రివీల్ చేయకపోయినా సినిమాలో కమల్ పాత్ర గురించి కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ పేరు రంగరాయ సత్తివేల్ నాయకన్. చివరి పదం చూడగానే నాయకుడు గుర్తొచ్చేలా సెట్ చేసిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఎడారి లాంటి నిర్మానుష్యంగా ప్రదేశంలో ముఖానికి ముసుగు చుట్టుకుని ఉండగా తన మీద దాడి చేసిన ముష్కరుల గుంపుని నిర్దాక్షిణ్యంగా నరికి పారేసే ఎపిసోడ్లో రంగరాయుడు తన స్వయంగా చెప్పుకోవడం ఈ సందర్భంగా చూపించారు. స్టోరీ బ్యాక్ గ్రౌండ్ ఏ కాలంలో జరుగుతుంది, ఇది పీరియాడిక్ డ్రామానా లేక వర్తమానమా లాంటివి చెప్పలేదు
ప్రధాన హైలైట్ గా నిలిచింది మాత్రం ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా గ్యాప్ తర్వాత తన స్థాయిలో బిజిఎం ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. అయితే తగ్ లైఫ్ టైటిల్ మాత్రం వెరైటీగా ఉంది. మాములుగా ఉద్యోగుల ప్రపంచంలో జీవితం ఉరుకులు పరుగులు మీద పోతోందని చెప్పడానికి సంకేతంగా దీన్ని వాడతారు. మరి మణిరత్నం తన శైలికి భిన్నంగా ఇంగ్లీష్ పేరుని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్యాన్ ఇండియా కోసం చేసినట్టు అర్థమవుతోంది. కమల్ హాసన్ 234వ సినిమాగా రూపొందుతున్న తగ్ లైఫ్ లో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవితో పాటు భారీ తారాగణం భాగం కానుంది.
This post was last modified on November 6, 2023 6:35 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…