బాలీవుడ్ లోనే కాదు తెలుగు తమిళంలోనూ భారీ బజ్ మోసుకుంటున్న అనిమల్ విడుదల తేదీ డిసెంబర్ 1 కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత దాని రీమేక్ కబీర్ సింగ్ తప్ప దర్శకుడు సందీప్ వంగా ఇంకే సినిమా చేయలేదు. ఒక ప్రేమకథనే అంత అగ్రెసివ్ గా చూపించినవాడు, మాఫియా డ్రామాని ఇంకే రేంజ్ లో తీర్చిదిద్ది ఉంటాడోనని విపరీతమైన అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఆల్రెడీ రెండు పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి. ట్యూన్స్ కన్నా ఎక్కువ రన్బీర్ కపూర్ రష్మిక మందన్నల మధ్య కెమిస్ట్రీనే ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
ఇంత హైప్ ఉన్న అనిమల్ కి ఎదురు పడటం ఖచ్చితంగా రిస్కే. అందుకే పేరున్న మీడియం రేంజ్ హీరోలు సైతం ఆ డేట్ ని వదిలేశారు. కానీ విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ ని మాత్రం అదే తేదీకి విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ కథ ఆధారంగా ఈ బయోపిక్ ని దర్శకురాలు మేఘన గుల్జార్ రూపొందించారు. విక్కీ కౌశల్ దీని కోసం గుర్తుపట్టలేనంత స్థాయిలో మేకోవర్ చేసుకుని ఆ పాత్రకు తగ్గట్టు సిద్ధమయ్యాడు. రేపు ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా పబ్లిక్ లో దీని మీద ఆసక్తి పెరిగిపోతుందని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.
మరి అనిమల్ తో తలపడటం అంటే పెద్ద సాహసమే. కానీ మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిజానికి అనిమల్ ఆగస్ట్ 15 రావాల్సింది. గదర్ 2, ఓ మై గాడ్ 2తో అనవసరంగా క్లాష్ కావడం ఇష్టం లేకపోవడంతో పాటు ప్రమోషన్ కి తగినంత టైం లేకపోవడంతో డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యారు. అది కూడా సోలో డేట్ అనే నమ్మకంతో. జానర్ ప్లస్ కంటెంట్ పరంగా రెండింటికి సంబంధం లేకపోయినా ఓపెనింగ్స్ పంచుకోవాల్సి ఉంటుంది. అనిమల్ ఊపు చూస్తుంటే విక్కీ కౌశల్ దాన్ని ఫేస్ చేయడం అంత సులభంగా ఉండేలా లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రెండు బృందాలు బిజీగా ఉన్నాయి.
This post was last modified on November 6, 2023 4:58 pm
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…