ఒకపక్క సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోషించాలో లేక దాన్ని వాడుకుని తప్పుడు పనులకు తెర తీస్తున్న కొందరిని చూసి బాధ పడాలో అర్థం కాని అయోమయం నెలకొంటోంది. మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా రష్మిక మందన్న మొహాన్ని తీసుకుని ఇంకో మోడల్ కి అతికించి అసభ్యంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం బాగా వైరల్ అయ్యింది. ఇది చాలా దుర్మార్గమని స్వయంగా అమితాబ్ బచ్చన్ అంతటి పెద్దవారే లీగల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపు ఇవ్వడం చూస్తే పరిస్థితి ఎంత విషమంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగదు.
గతంలో సమంతా, సాయిపల్లవి, కాజల్ అగర్వాల్ లను సైతం ఇలా ఇతర వీడియోలకు మార్ఫింగ్ చేసి శునకానందం పొందిన వాళ్ళు లేకపోలేదు. తాజాగా ఏఐ(ఆర్టిఫీషియల్ టెక్నాలజీ) హవా మొదలైంది. దీనితో ఒరిజినల్ నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. దీన్ని వాడి ఆ మధ్య కొందరు గుంటూరు కారం, స్పిరిట్ పోస్టర్లు తయారు చేస్తే అవి నిజమే అనుకుని తమ ఊళ్ళలో ఫ్లెక్సిలు చేయించిన అమాయక అభిమానులున్నారు. ఇంకా హై ఎండ్ టూల్స్ వాడితే మన పెళ్లికి మహేష్ బాబు వచ్చినట్టు, బర్త్ డేకి పవన్ కళ్యాణ్ హాజరైనట్టు గ్రాఫిక్స్ సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దీనికి అడ్డుకట్ట వేయడం సులభం కాదు. ప్రభుత్వాలు చర్యలకు పూనుకుని చట్టాలు కఠినం చేయకపోతే ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇవాళ రష్మిక రేపు మరో హీరోయిన్ ఈ ప్రహసనానికి బాధితురాలిగా మారొచ్చు. ఇప్పటికి అంత సీరియస్ మ్యాటర్ అనిపించినా అనిపించకపోయినా భవిష్యత్తులో ఇలాంటివే సున్నిత మనస్కులు ఎవరినైనా ప్రాణాలు బలిపెట్టే దాకా వెళ్లొచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యాప్స్ సహాయంతో విచ్చలవిడిగా ఇలాంటి కంటెంట్ సృష్టించే సౌలభ్యం ఉన్న వాతావరణంలో కట్టడి చేయడం సవాలే. చైనా, జపాన్ లాంటి నియమాలు పెడితే తప్ప మార్పు రాదేమో.
This post was last modified on November 6, 2023 2:25 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…