స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలు అభిమానులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తాయి. సలార్ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ వాయిదా పడొచ్చనే ప్రచారం నిన్న కొన్ని మీడియా వర్గాల్లో జరగడం చూసి ఫ్యాన్స్ హడావిడి పడిపోయి సోషల్ మీడియాలో తమ నిరసనని వ్యక్తం చేశారు. డుంకి ప్రోమో వచ్చాక కూడా సలార్ కనీసం ప్రభాస్ కనిపించే టీజర్ వదలకపోవడం పట్ల ఇప్పటికే బోలెడు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అయితే నిర్మాణ వర్గాలు మాత్రం వీటిని పూర్తిగా కొట్టి పారేస్తున్నాయి. వాయిదా సమస్యే లేదంటున్నాయి.
విడుదల తేదీకు అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాక్ అవుతున్నారు. సంక్రాంతి సినిమాలకే కేటాయింపులు జరుగుతున్న తరుణంలో వాటికి ఇరవై రోజుల ముందు వస్తున్న సలార్ ని ఊరికే వదిలేస్తారా. షారుఖ్ ఖాన్ ఓవర్సీస్ లో ప్రభావం చూపించే మాట వాస్తవమే అయినా హోంబాలే ఫిలింస్ ఎంత మాత్రం తగ్గే ఆలోచనలో లేరు. పైగా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వేసవి దాకా స్లాట్ దొరకదు. ఒకసారి జరిగిన వాయిదాకే ఇతర టాలీవుడ్ నిర్మాతలు తమ ప్లానింగ్ మార్చుకుని నానా రకాల ఇబ్బందులు పడ్డారు.
సో సలార్ తప్పుకోవడమనే మాట ఉత్తుత్తిదే. దీపావళికి కొత్త టీజర్ ఆశిస్తున్న అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒత్తిడి మధ్య జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ తో పాటు ఎడిటింగ్ టీమ్ మొత్తం ఫైనల్ కాపీని సిద్ధం చేసే దిశగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ అయ్యాకే సలార్ పబ్లిసిటీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎలాగూ ఇండియా ఫైనల్ కు వెళ్తుంది కాబట్టి ఆ హడావిడిలో సినిమాలను పట్టించుకోరు. అందుకే నవంబర్ 20 నుంచి ఏ నిమిషంలో అయినా సలార్ దూకుడు మొదలవ్వొచ్చు.
This post was last modified on November 6, 2023 1:23 pm
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…