‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో సమంత ఓటిటి ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ఇంతకుముందు పాన్ ఇండియా ప్రాజెక్టులేవీ చేయని సమంత ఈ హిట్ వెబ్ సిరీస్‍లో ఒక విలక్షణమైన పాత్ర పోషించింది. ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తో వుంటుందని మొదట్నుంచీ ప్రచారంలో వుంది. ఈ సిరీస్ కోసం సమంత అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుండగా, ఆ రోజు త్వరలోనే రానుందని సమంత హింట్ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 2 డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది.
సమంత ఇందుకోసం డబ్బింగ్ చెప్పే పనిలో వుంది. డబ్బింగ్ సూట్ నుంచి అప్‍డేట్ ఇస్తూ ‘మీరంతా ఒక క్రేజీ రైడ్‍కి సిద్ధంకండి’ అని చెప్పింది. సమంత ఇలా రిలీజ్‍కి ముందే ఎక్సయిట్ అయిన ప్రాజెక్టుల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. చూస్తోంటే ఈ సీజన్ మొదటి సీజన్ కంటే ఎక్కువగా క్లిక్ అవుతుందని అనిపిస్తోంది. మనోజ్ బాజ్‍పేయి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సీజన్ అమెజాన్ ప్రైమ్‍లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సీజన్ రిలీజ్ డేట్ ఏమిటనేది అధికారికంగా ప్రకటించలేదు కానీ అక్టోబర్ నుంచి స్ట్రీమ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
This post was last modified on August 28, 2020 3:05 am
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…