Movie News

సలార్ పుకార్లకు చెక్ పెట్టాల్సిందే

ఒక పెద్ద ప్యాన్ ఇండియా మూవీని హ్యాండిల్ చేస్తున్నప్పుడు సదరు నిర్మాణ సంస్థలు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని కాదు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని సరైన రీతిలో కమ్యూనికేట్ చేయడం అవసరం. కానీ హోంబాలే ఫిలింస్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఒప్పుకోక తప్పదు. దీని వల్ల పుకార్ల ప్రహసనం ఎక్కువయ్యింది. ఇప్పుడు రెండు భాగాలు కాదని ఒకటే పార్ట్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ముందు లేని ఐటెం సాంగ్ ఇప్పుడు హఠాత్తుగా పెట్టి తీస్తున్నారని మరో టాక్ మొదలైంది.

ఇంకొందరు అడుగు ముందుకేసి సలార్ ఏకంగా 2024 మార్చికి పోస్ట్ పోన్ అయ్యిందని గాసిప్ తిప్పుతున్నారు. ఇది ముమ్మాటికీ నిజం కాదు. ఎందుకంటే డిసెంబర్ 22 తేదీకి అనుగుణంగా ఓవర్సీస్ స్క్రీన్లు బుక్ చేసేశారు. ఏపీ తెలంగాణ ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు లిస్ట్ అవుతున్నారు. కొన్ని ఒప్పందాలు సంతకాలు చేసుకోవడం కూడా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఏ దశలో ఉందనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటికి చెప్పొద్దంటూ స్ట్రిక్ వార్నింగ్ ఇవ్వడంతో యూనిట్ సభ్యులు చాలా గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ బయట కనిపించడమే మానేశాడు.

రీ రికార్డింగ్ పనులు అంత పీక్స్ లో ఉన్నాయి. సలార్ ప్రమోషన్లు ఈ నెల చివరి నుంచి ఊపందుకోవాలి. వీటి సంగతి ఎలా ఉన్నా ట్రైలర్ వస్తే తప్ప ఊపు వచ్చేలా లేదు. ఇంకోవైపు షారుఖ్ ఖాన్ డుంకీ ఫస్ట్ టీజర్ ఆల్రెడీ జనాన్ని ఆకట్టుకుంది. మాస్ కంటెంట్ కాకపోయినా రాజ్ కుమార్ హిరానీ నుంచి ఆశించే అంశాలకు లోటు లేదని క్లారిటీ ఇవ్వడంతో నార్త్ ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. డ్రాప్ 2 పేరుతో రెండో టీజర్ వచ్చే లోపు సలార్ ట్రైలర్ దింపక పోతే ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు కొత్త పుకార్లకు రెక్కలు తొడిగినట్టు అవుతుంది. అలా కాకూడదనే ఫ్యాన్స్ కోరిక.

This post was last modified on November 3, 2023 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంటరెస్టింగ్!.. టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!

అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…

16 minutes ago

వర్మ విచారణకు వచ్చాడండోయ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…

34 minutes ago

అనిరుధ్ కోసం దర్శకుల పడిగాపులు

సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…

59 minutes ago

వైసీపీలోకి శైలజానాథ్.. ఆ లారీ డ్రైవర్ కు కష్టమే

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…

1 hour ago

ఎన్డీయే చైర్మన్ పదవిని చంద్రబాబు కోరారా..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…

2 hours ago

జగన్ కు సాయిరెడ్డి గట్టిగా ఇచ్చేశారుగా…!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…

3 hours ago