బోయపాటి శ్రీను సినిమా రిలీజైందంటే.. అందులో లాజిక్కులు, ఓవర్ ద టాప్ సీన్ల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కొత్తేమీ కాదు. ఐతే ఆయన కొత్త సినిమా ‘స్కంద’లో కథతో పాటు అనేక అంశాలు ఇల్లాజికల్‌గా, అర్థ రహితంగా అనిపించడంతో థియేట్రికల్ రిలీజ్ టైంలో ట్రోలింగ్ కూడా అందుకు తగ్గట్లే సాగింది. ఒక పల్లెటూరికి చెందిన మామూలు కుర్రాడు.. సెక్యూరిటీ మొత్తాన్ని ఆటాడించి సీఎం ఇళ్లలోకి వెళ్లిపోవడం.. సీఎం భయపడి నీకు కావాల్సింది తీసుకుపో అనడం.. ఇద్దరు సీఎం కూతుళ్లను హీరో సింపుల్‌గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం.. ఇలాంటి విడ్డూరాలెన్నో ‘స్కంద’లో ఉన్నాయి.
బైకుని రౌండ్ తిప్పినట్లు ట్రాక్టర్‌ను రౌండ్ తిప్పడం.. దుక్కి దున్నడానికి ఉపయోగించే మరలతో హీరో పోలీసులను పొడిచి చంపడం.. చక్కిలిగింతలు పెట్టినట్లుగా కత్తితో పోట్లు పొడవడం.. ఇలాంటి సీన్లు పెట్టడం బోయపాటికే చెల్లింది. కథ విషయంలో, ఇలాంటి సన్నివేశాల విషయంలో బోయపాటిని నెటిజన్లు ఒక రేంజిలో ఆడుకున్నారు రిలీజ్ టైంలో. ఇప్పుడు ‘స్కంద’ సినిమా ఓటీటీలోకి వచ్చింది. దీంతో మరోసారి బోయపాటి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు.
సినిమాలో మరిన్ని లోపాలను బయటపెడుతూ.. ఇల్లాజికల్ అంశాలను తూర్పారబడుతూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. థియేటర్లో జనాలు గుర్తించలేని విషయాలను.. ఇప్పుడు ఓటీటీలో నెమ్మదిగా సినిమా చూస్తూ బయటపెట్టేస్తున్నారు జనాలు. ఉదాహరణకు రెండు సీన్ల గురించి మాట్లాడుకుందాం. ఒక సన్నివేశంలో రామ్.. సీఎం దగ్గరుండే పోలీస్‌ని పొడిచి చంపుతాడు. దానికి రియాక్షన్ షాట్‌లో సీఎంను చూపిస్తే.. ఆ వెనుక కూడా అదే వ్యక్తి నిలబడి ఉంటాడు.
ఈ లోపాన్ని గుర్తించి.. ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంకో సీన్లో హీరో, హీరోయిన్లు పొలిటికల్ సైన్స్ కోర్స్ చదువుతున్నట్లు చూపిస్తారు. క్లాస్ రూంలో లెక్చరర్ స్పష్టంగా ఈ విషయం చెబుతాడు. ఐతే తర్వాతి సీన్లో హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కనిపించినపుడు వారి చేతుల్లో ‘ఫండమెంటల్స్ ఆఫ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ’ అని.. ‘పాథాలజీ రివ్యూ’ అని కోర్సుతో సంబంధం లేని పుస్తకాలుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. నెటిజన్లు ఎత్తి చూపిస్తున్న లోపాలు చాలానే ఉన్నాయి. బోయపాటి కథల్లాగే ఆయన సినిమాల్లో ఇలాంటి డీటైలింగ్‌కి కూడా లాజిక్ ఉండదని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…