Movie News

కంటెంట్ ఇవ్వవయ్యా సలార్

ప్రభాస్, ప్రశాంత్ నీల్.. ఈ రెండు పేర్లు చాలు సినిమాకు హైప్ రావడానికి. వీరి కలయికలో మొదలైన ‘సలార్’కు ముందు నుంచే బంపర్ క్రేజ్ ఉంది. ఆ హైప్ అంతకంతకూ పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. ప్రభాస్‌ను సరిగ్గా చూపిస్తూ ఒక లుక్ కూడా రిలీజ్ చేయకపోయినా సరే.. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసిన రేంజ్ ఈ సినిమాది. ఈ సినిమా టీజర్లో కూడా ప్రభాస్ ముఖం పూర్తిగా కనిపించని సంగతి తెలిసిందే.

ఐతే సెప్టెంబరు 28 నుంచి ఈ చిత్రాన్ని డిసెంబరు 22కు వాయిదా వేయగా.. ఆ తర్వాత కూడా టీం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అక్టోబరు 23న ట్రైలర్ ఉంటుందన్నారు. కానీ ఆ ఊసే లేదు. ఇక రిలీజ్‌కు 50 రోజుల సమయమే ఉండగా.. ఇప్పుడు కూడా టీం నుంచి సౌండ్ లేదు. ట్రైలర్ సంగతి తర్వాత ఒక టీజరో.. లేదంటే ఒక పాటో రిలీజ్ చేస్తే అభిమానులు దాంతో కాలక్షేపం చేస్తారు.

సగటు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఉత్సాహం పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ సమయానుకూలంగా ఇవ్వాల్సిందే. కానీ ‘సలార్’ టీం మాత్రం ఏం చేస్తోందో ఏమో తెలియట్లేదు. సినిమా నుంచి కనీసం ఒక పాట కూడా రిలీజ్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందనే చర్చ నడుస్తోంది. సినిమాకు హైప్ ఉంది కదా అని.. ప్రేక్షకాభిమానాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుని టీం సైలెంటుగా ఉండటం అభిమానులకు రుచించడం లేదు.

భారీ ప్ర‌మోష‌న్లు భారీ ప్ర‌మోష‌న్లు అని స‌లార్ టీం ప్లాన్స్ గురించి సోష‌ల్ మీడియాలో ఊద‌ర‌గొట్ట‌డ‌మే త‌ప్ప‌.. చ‌ప్పుడే ఉండ‌ట్లేదు. క్రిస్మస్ వీకెండ్లో రాబోతున్న హిందీ చిత్రం ‘డంకీ’ నుంచి కూడా ఒక చిన్న ట్రైలర్ లాంటిది రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఇంకో ట్రైలర్ కూడా వదలబోతోంది టీం. ఐతే ‘సలార్’ టీం మాత్రం ఇలాంటి హడావుడి ఏమీ లేకుండా మౌనం వహిస్తోంది. అసలే రీషూట్లు, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆలస్యాలు అంటూ నెగెటివ్‌ న్యూస్‌లు సినిమాను చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకనైనా టీంలో కదలిక వచ్చి మంచి కంటెంట్ వదులుతారేమో చూడాలి.

This post was last modified on November 2, 2023 10:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago