స్టార్ హీరోల ఫ్యాన్స్ కి తమ అభిమాన కథానాయకుడికి సంబంధించిన ఏ విషయమైనా సంబరమే. ఒకప్పుడు ఏదైనా విశేషం ఉంటే కేక్ కటింగ్ లేదా అన్నదానాలు చేయడం లాంటివి జరిగేవి. ఇప్పుడంతా ఆన్ లైనే. తిట్టుకున్నా పొగుడుకున్నా మొత్తం ట్విట్టర్, ఇన్స్ టాలోనే. అధిక శాతం బాపతుకి ఒరిజినల్ ఐడి ఉండదు. తాజాగా రామ్ చరణ్ కు ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు కొద్ది వారాల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆ సందర్భంలోనే ఇద్దరి అభిమానులు పరస్పరం కవ్వించుకుని రచ్చ చేశారు.
నిజానికి ఇది అచీవ్ మెంటే. అలా అని ఆస్కార్ వచ్చినంత రేంజ్ లో ఫీలవ్వడకూడదు. ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళి తాను అనుకున్నది పూర్తిగా కాకపోయినా నాటు నాట పాట ద్వారా టాలీవుడ్ దశాబ్దాలుగా కన్న కలని నిజం చేసుకున్నాక దాన్ని అక్కడితో వదిలేశారు. ఒకరిద్దరు ఇండస్ట్రీ పెద్దలు గ్రాండ్ గా సన్మానం చేస్తామన్నా అది కీరవాణి, చంద్రబోస్ లకు చేయండి తప్ప తనకు కాదని సున్నితంగా వద్దన్నారట. ఒకవేళ ఇప్పుడు చరణ్ తారక్ లు సాధించినది అంతకు మించే అయితే అది జక్కన్న ట్విట్టర్ లో కనీసం శుభాకాంక్షల రూపంలో కనిపించాలి కదా.
కానీ రాజమౌళి తారక్ చరణ్ ఇద్దరిలో ఎవరికీ విష్ చేయలేదు. సో దీన్ని బట్టి ఆయనెంత లైట్ తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. యాక్టర్స్ బ్రాంచ్ అంటే గౌరవమే కానీ తిరుగులేని గుర్తింపు కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. దీని మీద వాదోపవాదాలు పక్కన పెడితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఎవరి పనులు, ఎవరి షూటింగుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు తప్పించి తమకొచ్చిన వాటి గురించి స్పందించడం కూడా ఆపేశారు. అయినా ఆర్ఆర్ఆర్ వచ్చి ఏడాదిన్నర దాటేసింది. ఇంకా దాని తాలూకు సంగతులతో డిబేట్లు పెట్టుకోవడం అనవసరం. ఆ సినిమా ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు.
This post was last modified on November 2, 2023 6:32 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…