బేబి.. గత కొన్నేళ్లలో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతో చాలామంది జీవితాలు మారిపోయాయి. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కలిసి వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. వీరి కలయికలో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. హీరోయిన్ వైష్ణవి చైతన్య చేతికి మూణ్నాలుగు ప్రాజెక్టులు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండ సైతం బిజీ అవుతున్నాడు.
ఆల్రెడీ ఆనంద్-వైష్ణవి కలయికలో సాయిరాజేష్-ఎస్కేఎన్ కలిసి ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి క్రేజ్ వచ్చింది. ఇది కాక ఆల్రెడీ ఆనంద్ చేతిలో ‘గం గం గణేష’తో పాటు మరో సినిమా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమాను మొదలు పెట్టాడు ఆనంద్. ఆ చిత్రం కొంచెం పెద్ద స్థాయిలోనే తెరకెక్కబోతోంది. ఆనంద్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమా మీదే పెడుతున్నారు.
ఆనంద్ కొత్త సినిమా పేరు.. డ్యూయెట్. ఈ పేరు వినగానే 90వ దశకంలో రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించిన ఒక లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ‘అంజలి అంజలి’ అనే పాట ఎంత పాపులరో తెలిసిందే. ఈ టైటిల్‌తో మిథున్ వరదరాజా అనే దర్శకుడు ఆనంద్‌తో సినిమా తీస్తున్నాడు. తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటించబోతోంది. జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నాడంటే ఇది ఒక రేంజ్ ఉన్న సినిమానే అని అర్థం చేసుకోవచ్చు. ఇండియాతో పాటు ఫారిన్ లొకేషన్లలోనూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కాంబినేషన్ అదీ చూస్తుంటే ఆనంద్ కెరీర్‌ను కొన్ని మెట్లు ఎక్కించే సినిమాలా కనిపిస్తోంది.
This post was last modified on November 2, 2023 5:41 pm
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…