బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన జవాన్ ని ఎప్పుడెప్పుడు ఓటిటిలో రిపీట్ షోలు చూద్దామా అని అభిమానులు వారాల తరబడి ఎదురు చూస్తూ వచ్చారు. రెండు నెలల ఒప్పందం పూర్తయిపోవడంతో షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నెట్ ఫ్లిక్స్ నవంబర్ 2 అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. ఎక్స్ టెండెడ్ కట్ వెర్షన్ అంటూ ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసింది. అంతే థియేటర్ కాపీ కాకుండా అదనంగా పక్కన పెట్టిన ఎడిటింగ్ ఫుటేజ్ ఇందులో కలుపుతారని దాని ఉద్దేశం. దీంతో ఇంకేం స్పెషల్ ఉందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఫోన్లు, టీవీలో షోలు వేసుకున్నారు.
తీరా చూస్తే ఇదంతా ఉత్తుత్తి బిల్డపని అర్థమైపోయింది. డిజిటల్ వెర్షన్ జవాన్ 170 నిమిషాలే ఉంది. అంటే మనం తెరమీద చూసిన దానికి ఈ ప్రింట్ కి కేవలం రెండు మూడు నిమిషాలే తేడా. ఆ కాసింత సన్నివేశాలు ఏవో కూడా గుర్తుపట్టలేనంతగా కలిపేశారు. దీంతో నిరాశ తప్పలేదు. గతంలో పఠాన్ కు సైతం ప్రైమ్ ఇలాగే చేసింది. నిజానికి కత్తెరకు బలైన జవాన్ భాగంలో నయనతార సీన్లు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇద్దరు షారుఖ్ లు కలుసుకున్నాక జరిగే సంఘటనలు ఇంకొన్ని పెట్టాడు దర్శకుడు ఆట్లీ. అవన్నీ నెట్ ఫ్లిక్స్ లో చూసుకోవచ్చనుకుంటే ఇదిగో ఇలా ట్విస్టు ఇచ్చారు.
దీని సంగతి ఎలా ఉన్నా వ్యూస్ పరంగా నెట్ ఫ్లిక్స్ పంట పండబోతోంది. దేశ్ విదేశాల్లో మిలియన్ల వ్యూస్ జవాన్ కి పోటెత్తబోతున్నాయి. ఈ మధ్య ఇండియన్ కంటెంట్ అందులోనూ సౌత్ సినిమాలకు గ్లోబల్ గా మంచి ఆదరణ దక్కుతోంది. వారాల తరబడి మనవి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. భోళా శంకర్, రామబాణం లాంటి అల్ట్రా డిజాస్టర్లు సైతం కేవలం నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన కారణంగానే పది రోజులు టాప్ టెన్ లో ఉన్నాయి. అలాంటిది జవాన్ చేయబోయే అరాచకం నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ఖాయం. ఫైనల్ గా ఎక్స్ టెండెడ్ జవాన్ ని ఎక్కువ ఊహించుకున్న షారుఖ్, నయన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.
This post was last modified on November 2, 2023 4:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…