ప్రభాస్ సలార్ తో పోటీ ఉండటం వల్ల మన ప్రేక్షకుల దృష్టి షారుఖ్ ఖాన్ డుంకీ మీద కూడా ఉంది. ముందు విడుదల తేదీ ప్రకటించింది ఇదే అయినప్పటికీ అనూహ్య పరిణామాల తర్వాత డార్లింగ్ సైతం అదే డేట్ ని తీసుకోవాల్సి వచ్చింది. అయితే డుంకీ కంటెంట్ ఎలా ఉండబోతోందనే దాని మీద ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంది. పైగా ఒకే సంవత్సరం రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు పఠాన్, జవాన్ రూపంలో అందుకున్న షారుఖ్ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా డ్రాప్ 1 పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు.
కథని ఎక్కువ రివీల్ చేయకుండా తెలివిగా కట్ చేయించారు. ఎక్కడో సుదూరంగా ఎడారి లాంటి ప్రాంతంలో తనలాంటి వాళ్ళతో కలిసి ఒంటరిగా నడుస్తున్న హార్దీ(షారుఖ్) గుంపు వెనుక నుంచి ఓ దుండగుడు కాల్పులు జరుపుతాడు. అప్పుడతని గతమేంటో ఓపెనవుతుంది. ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు, ఓ అమ్మాయి(తాప్సీ పన్ను) ఇంగ్లాండ్ వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే అది తమ మతాచారానికి వ్యతిరేకమని పెద్దలు వాదిస్తూ ఉంటారు. వాళ్ళను కాదని హార్దీ బృందం ఏం చేసిందిందనేది తెరమీద చూడాలి.
ఎంత సీరియస్ మెసేజ్ అయినా సరే దాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పడంలో తనదైన శైలిని కలిగిన రాజ్ కుమార్ హిరానీ ఇందులోనూ అదే ఫాలో అయ్యారు. సింపుల్ సన్నివేశాలు సైతం నవ్వు పుట్టించేలా ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. రొటీన్ మాస్ కి భిన్నంగా షారుఖ్ పాత్ర చాలా ఫన్నీగా అనిపిస్తోంది. ప్రేక్షకులకు కొత్తగా ఫీలవుతారు. విక్కీ కౌశల్ కు ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కింది. బోమన్ ఇరానీ మరోసారి అదరగొట్టేలా ఉన్నారు. ఏ మాటకామాటే సలార్ లో ఎంత యాక్షన్ మసాలా ఉన్నా డుంకీలో ఉన్న వినోదం దానికి ధీటుగా పోటీ ఇచ్చేలా ఉంది. డ్రాప్ 2 టీజర్ మరొకటి రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 21 సినిమా విడుదలవుతుంది
This post was last modified on November 2, 2023 2:41 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…