మొన్న ఆదివారం విశ్వక్ సేన్ తన గ్యాంగ్స్ అఫ్ గోదావరి విడుదల గురించి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఎంత రచ్చ చేసిందో చూస్తున్నాం. కొంతసేపయ్యాక డిలీట్ చేశాడు కానీ అప్పటికే అది విపరీతంగా వైరల్ అయిపోయి ఇండస్ట్రీలోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ చర్చను లేవనెత్తింది. ఒకవేళ సినిమా కనక డిసెంబర్ లో రిలీజ్ కాకపోతే ప్రమోషన్లలో తనను చూడరని శపథం చేయడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అయితే విశ్వక్ ఇలా వివాదాలు, వార్తల్లో నలగడం ముందు నుంచి ఉన్నదే. అసలేం జరిగిందనే దాని మీద నిర్మాత నాగవంశీ వైపు నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది.
గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇంకో పాట షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అదయ్యాక ఫైనల్ కాపీని హీరో నిర్మాత చూసుకుని ఇద్దరూ సంతృప్తి చెందితే అప్పుడు వెనుకడుగు వేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు కాదు. అయినా గ్యాంగ్స్ అఫ్ గోదావరికి సరిపడా బజ్ ఉంది. ముందు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు పోటీలో వరుణ్ తేజ్ వాలెంటైన్ మాత్రమే ఉంది. సలార్ వల్ల హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు ముందుకొచ్చాయి. దీని వల్ల తన సినిమా ఏమైనా కిందకు వెళ్తుందేమోనని విశ్వక్ అనుమానపడ్డాడు.
ఈ క్రమంలో ఇన్స్ టాలో హెచ్చరిక లాంటి మెసేజ్ పెట్టాడు తప్పించి ఏదీ ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. ఇదంతా నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చిన వెర్షనే. విశ్వక్ నుంచి క్లారిటీ రావాలంటే ఏదైనా ఈవెంట్ లో చెప్పాలి లేదా గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రమోషన్లలో మీడియాని కలిసినప్పుడు మాట్లాడాలి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ విలేజ్ మాఫియా డ్రామా కోసం విశ్వక్ హెయిర్ స్టైల్ ని పూర్తిగా మార్చుకుని కొత్తగా కనిపిస్తున్నాడు. డిసెంబర్ 29కి వెళ్లొచ్చనే ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదీ స్పష్టంగా తెలియడం లేదు. ఈ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. చూద్దాం.
This post was last modified on November 1, 2023 7:09 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…