సంక్రాంతి పోటీ గురించి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో దీని గురించిన వాడివేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బింగ్ తో కలిపి ఏకంగా ఆరేడు సినిమాలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ పంతం పట్టడంతో థియేటర్ల సర్దుబాటు గురించి డిస్ట్రిబ్యూటర్లలో ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. అన్నీ పెద్ద ప్రొడ్యూసర్లవే. అందరూ స్టార్ హీరోలే. హనుమాన్ కథానాయకుడు తేజ సజ్జ పెద్ద రేంజ్ కాకపోయినా అందులో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి ప్యాన్ ఇండియా బ్రాండ్ పడింది. నిర్మాత నాగవంశీ తాజాగా ఈ పరిణామాలు, గుంటూరు కారం గురించి మాట్లాడారు.
పండగకు ఇన్నేసి సినిమాలు రావడం పట్ల తనకెలాంటి ఫీలింగ్ లేదని, అందరి ఛాయస్ గుంటూరు కారం అయినప్పుడు తానెందుకు ఇతర ప్రొడ్యూసర్లని కలవాలంటూ తేల్చి చెప్పారు. కావాలంటే వాళ్లొచ్చి మాట్లాడితే వింటాను తప్ప రిలీజుల విషయంలో తాను చేయగలిగింది ఏమి లేదనే రీతిలో కుండబద్దలు కొట్టారు. తొలి ఆడియో సింగల్ కూడా నవంబర్ మొదటి వారం అనేశారు కానీ ఆల్రెడీ ఫస్ట్ వీక్ మొదలైన నేపథ్యంలో ఈ ఆరు రోజుల్లో నిజంగా విడుదల చేస్తారానేది అనుమానంగానే ఉంది. గత నెల తమన్ సైతం నవంబర్ నుంచి మహేష్ సందడి ఉంటుందని క్లూస్ ఇచ్చాడు.
రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాబోతున్నాయి. మరోవైపు ఈగల్ జనవరి 13 నుంచి 26కి షిఫ్ట్ అయ్యిందనే వార్తలను రవితేజ నిర్మాతలు ఖండిస్తూ సంకేతాలు పంపిస్తున్నారు. తాము రేస్ లోనే ఉన్నామని వాయిదా సమస్యే లేదనే రీతిలో నొక్కి వక్కాణిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎంత బలంగా చెప్పుకున్నా ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితుల్లో ఏ నిమిషంలో ఏ నిర్ణయాలు వస్తాయో చెప్పలేం. నిన్నటిదాకా రిలీజ్ డేట్ల మీద కట్టుబడి ఉన్న ఆదికేశవ, డెవిల్ లు హఠాత్తుగా పక్కకు తప్పుకోవడం ఇవాళే చూశాం. సో రెండు నెలల్లో బోలెడు అప్డేట్స్ ఫ్యాన్స్ మీద దండెత్తబోతున్నాయి
This post was last modified on November 1, 2023 4:13 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…