Movie News

‘యానిమల్’ గురించి ఆ ప్రచారం అబద్ధమట

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘యానిమల్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇది పక్కా హిందీ సినిమా అయినప్పటికీ.. దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు తెచ్చుకున్న చిత్రంగా ఇది నిలిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు.

‘యానిమల్’ రిలీజ్‌కు సరిగ్గా ఇంకో నెల రోజుల సమయమే ఉండగా.. ఈ లోపు ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సినిమా రన్ టైం మూడున్నర గంటలని.. ఆ నిడివితోనే ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్నారని  నిన్నట్నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘దాన వీర శూర కర్ణ’ రోజుల్లో అయితే మూడున్నర నాలుగ్గంటల నిడివి ఉన్నా థియేటర్లలో జనం చూశారు కానీ.. గత రెండు దశాబ్దాల్లో ఇంత రన్‌టైంతో రిలీజైన మెయిన్ స్ట్రీమ్ సినిమాలు దాదాపుగా కనిపించవు.

రన్ టైం ఇంకా ఇంకా తగ్గించేస్తున్న ఈ రోజుల్లో మూడున్నర గంటల నిడివి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఐతే ఈ వార్త వైరల్ అయ్యాక ‘యానిమల్’ టీం నుంచి క్లారిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ రన్ టైం గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదట. ఇంకా ఫైనల్ లెంగ్త్ లాక్ చేయలేదని తెలుస్తోంది. విడుదలకు రెండు వారాల ముందే ఈ విషయం తేలుతుందట.

‘అర్జున్ రెడ్డి’కి కూడా మూడున్నర నాలుగ్గంటల మధ్య రన్ టైం వస్తే.. చివరికి ఎడిట్ చేసి మూడు గంటల నిడివితో రిలీజ్ చేయించాడు సందీప్. ‘యానిమల్’ రన్ టైం కూడా ఎక్కువ ఉంటుందని.. కానీ మూడున్నర గంటల నిడివితో రిలీజ్ చేసే అవకాశాలే లేదని తెలుస్తోంది. థియేటర్ల యాజమాన్యాలే అంత నిడివికి ఒప్పుకోవు. ఆ రన్‌టైంతో రోజుకు నాలుగు షోలు రన్ చేయడం కష్టమవుతుంది. ఇక ప్రేక్షకులు కూడా సినిమా ఎంత బావున్నా కూడా అంత టైం వెచ్చించడం అంటే కష్టమే. కాబట్టి మహా అయితే మూడు గంటల నిడివితో రిలీజ్ చేస్తారే తప్ప మూడున్నర గంటలకు స్కోపే లేదని టీం వర్గాలు అంటున్నాయి.

This post was last modified on October 31, 2023 1:39 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

20 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

22 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

5 hours ago