ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ఆ అంచనాల్ని మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. రూ.128 కోట్లతో ‘రంగస్థలం’ సినిమా నెలకొల్పిన ‘నాన్ బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టేసింది. రూ.140 కోట్లకు పైగా షేర్‌తో కొత్త రికార్డు నెలకొల్పింది.
‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరో భారీ చిత్రం పోటీలో ఉండగా ఈ రికార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. ఐతే వెండితెర మీదే కాదు.. ఈ సినిమా బుల్లితెర మీదా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ ‘బాహుబలి’నే కాదు.. అన్ని సినిమాలనూ దాటేసింది.
ఆల్ టైం రికార్డును చెప్పుకోదగ్గ తేడాతో దాటేసి కొత్త టీఆర్పీ రికార్డు నెలకొల్పింది. ఇటీవలే జెమిని టీవీలో ‘అల వైకుంఠపురములో’ను ప్రిమియర్‌గా వేయగా.. రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బుల్లితెరపై ఒక సంచలనమే.
చాలా ఏళ్ల కిందట అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్‌తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇంత వరకు ఏ సినిమా అందుకోలేదు. ‘బాహుబలి’ సైతం 22 రేటింగ్‌కు పరిమితం అయింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మార్చిలో ప్రసారమైన మరో సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4తో దానికి చేరువగా వచ్చింది. మూడో స్థానాన్ని చేరుకుంది.
ఐతే లాక్ డౌన్ వల్ల జనాలు పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిన సమయంలో ఆ చిత్రానికి ఆ రేటింగ్ రాగా.. ఇటీవలే ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ దాన్ని దాటి ఆల్ టైం రికార్డును పెద్ద తేడాతో బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విరగాడి.. ఆపై రెండు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న సినిమాకు ఇప్పుడు టీవీలో ఈ స్థాయి రేటింగ్ రావడం కచ్చితంగా అద్భుతమే.
This post was last modified on August 27, 2020 2:13 pm
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…