ఈ ఏడాది తక్కువ బడ్జెట్ సినిమాల్లో పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన బేబీ దర్శకుడు సాయి రాజేష్ తన కంటెంట్ మీద సోషల్ మీడియాలో వస్తున్న నిబ్బా నిబ్బి కామెంట్ల గురించి స్పందించాడు. కలర్ ఫోటో, బేబీలకు ఇలాంటి మాటలు అన్నారని, కానీ తాను వాటిని పట్టించుకోవడం లేదని, నిర్మాత ఎస్కెఎన్ తో కలిసి మరో నాలుగు నిర్మించబోతున్నామని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ – వైష్ణవి ప్రాజెక్టుతో పాటు ఇవాళ మొదలుపెట్టిన సంతోష్ శోభన్ – హారిక కాంబినేషన్ లో రూపొందుతున్న లవ్ స్టోరీస్ కి కథ మాటలతో పాటు సహనిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఇవి కాకుండా మరో రెండు త్వరలోనే ప్రకటించబోతున్నారట. పూర్తిగా పరిపక్వత లేని వయసులో ప్రేమించుకునే వాళ్ళను నిబ్బా నిబ్బిలను అనడం ఆన్ లైన్ లో పరిపాటే. శ్రీవిష్ణు సామజవరగమనలో దీని మీద ఒక జోకు కూడా ఉంది. బేబీలో వైష్ణవి చైతన్య పాత్ర అచ్చం ఈ మనస్థత్వాన్నే ప్రతిబింబిస్తుంది. ఆనంద్ ని ప్రేమించి విరాజ్ తో శారీరకంగా కలుసుకుని చివరికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా తప్పు మీద తప్పు చేసి చివరికి ఒక యువకుడిని పిచ్చివాడిని చేస్తుంది. కలర్ ఫోటోలో ఇలా ఉండదు కానీ హీరో హీరోయిన్ పాత్రల చుట్టూ అలాంటి వాతావరణమే ఉంటుంది.
అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు ఇక్కడ తప్పొప్పుల ప్రస్తావన ఉండదు. గతంలోనూ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. తేజ తీసిన చిత్రం కోటి లోపు తీస్తే కోట్ల లాభాలు ఇచ్చింది. ప్రేమిస్తే గొప్పగా ఆడింది. జంధ్యాల గారు నాలుగుస్తంభాలాట, రెండు జెళ్ళ సీత లాంటివి లేలేత టీనేజ్ ప్రేమకథే. అయితే ఇక్కడో రిస్క్ లేకపోలేదు. బేబీ అంత గొప్పగా ఆడిందని మళ్ళీ అదే ఫ్లేవర్ లో తీయడమో లేక ఆ తరహా క్యారెక్టర్లతో చూపించడమో చేస్తే దెబ్బ పడుతుంది. అయితే సాయిరాజేష్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం అలాంటిది ఉంటుందా ఉండాదా అనే దానికన్నా ఫలితాల మీద కాన్ఫిడెన్స్ స్పష్టంగా ఉంది.
This post was last modified on October 30, 2023 3:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…