రెండు ప్యాన్ ఇండియా సినిమాలు ఒకేసారి తీస్తున్న దర్శకుడు శంకర్ వ్యవహార శైలి ఇద్దరు హీరోల అభిమానులకు ఎక్కడ లేని టెన్షన్ తెచ్చి పెడుతోంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ మొదటి ఆడియో సింగల్ జరగండి జరగండిని దీపావళికి రిలీజ్ చేస్తామని దిల్ రాజు టీమ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ హఠాత్తుగా ఇండియన్ 2 పరిచయ టీజర్ ని నవంబర్ 3 రిలీజ్ చేయబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ కొత్త పోస్టర్ తో చెప్పడం ఇంకో చర్చకు దారి తీస్తోంది. నిజానికి కమల్ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా ప్రీ లుక్ పోస్టర్లు తప్ప ఎలాంటి అప్డేట్లు రాలేదు. ఇదే మొదటిది.
ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కొత్త అనుమానం వస్తోంది. ఇండియన్ 2 టీజర్ లో దాని విడుదల తేదీ చెబుతారేమోనని. సంక్రాంతి అయితే ఛాన్స్ లేదు. పోనీ ఆగస్ట్ 15 అనుకుంటే ఆ డేట్ ని పుష్ప 2 ది రూల్ తీసేసుకుంది కాబట్టి అనవసరంగా పోటీకి వెళ్లే ఉద్దేశంలో శంకర్ లేరని సన్నిహితుల టాక్. అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ 2024 సమ్మర్. లేదూ అంటే లియో లాగా దసరాకు వచ్చి వసూళ్లు కుమ్మేసుకోవాలి. అదే జరిగితే గేమ్ చేంజర్ వచ్చే ఏడాది ఉండదని ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు వదిలే పాట కేవలం కంటి తుడుపు కోసమా లేక లీకయ్యింది కాబట్టి ఆడియో కంపెనీ ఒత్తిడి వల్లనానేది తేలాల్సి ఉంది.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఏదో ఒక సినిమా గురించి అయినా రిలీజ్ డేట్ లాక్ చేస్తే రిలీఫ్ గా ఉంటుంది. కమింగ్ సూన్ అని ఊరించకుండా పక్కాగా లాక్ చేసుకుంటే ఇతర నిర్మాతలు పోటీకి రాకుండా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ పనులు ఒకేసారి చూసుకుంటున్న శంకర్ మాత్రం ఫైనల్ కాపీ ఏది ముందు సిద్ధమవుతుందో దాన్ని బట్టే నిర్ణయం తీసుకుందామని నిర్మాతలతో అంటున్నారట. అదే నిజమైతే ముందా అవకాశం ఉన్నది ఇండియన్ 2కేనని చెన్నై టాక్. చూద్దాం వచ్చే వారమైనా ఈ గందరగోళం కొంతైనా తీరుతుందేమో.
This post was last modified on October 29, 2023 11:09 pm
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…
తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సర్కారీ…