శంకర్.. ఈ పేరు పోస్టర్ మీద చూసి కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయే ప్రేక్షకులు దక్షిణాదిన పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ‘జెంటిల్‌మ్యాన్’ మొదలుకుని.. ‘రోబో’ వరకు ఆయన సినిమాలు రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కానీ ‘రోబో’ తర్వాత శంకర్ నుంచి అంచనాలకు తగ్గ సినిమాలు రావట్లేదు. ఐ, రోబో-2 నిరాశ పరిచాయి. ఆ తర్వాత ఆయన మొదలుపెట్టిన ‘ఇండియన్-2’, ‘గేమ్ చేంజర్’ సినిమాలకు రకరకాల అడ్డంకులు ఎదురై దీర్ఘ కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నాయి.
‘ఇండియన్-2’ మధ్యలో ఆగిపోయాక ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టి చకచకా షూటింగ్ చేస్తుంటే.. మళ్లీ ‘ఇండియన్-2’ను పట్టాలెక్కించాల్సిన పరిస్థితి తలెత్తింది. సమాంతరంగా రెండు చిత్రాలనూ పూర్తి చేయడానికి వేసుకున్న ప్రణాళికలు ఫలించలేదు. వీటిలో ఏదీ పూర్తి కాక.. రిలీజ్ సంగతి తెలియక అయోమయం నెలకొంది. ముఖ్యంగా ‘గేమ్ చేంజర్’ విషయంలో చరణ్ ఫ్యాన్స్ ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలిసిందే.
షూటింగ్ అప్‌డేట్స్ లేక, సినిమా నుంచి ఏ విశేషాలూ వెల్లడి కాక వాళ్ల ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇలాంటి టైంలో దీపావళికి సినిమా నుంచి ‘జరగండి’ అనే పాట రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పాట తాలూకు పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఈ అప్‌డేట్ వచ్చిన కొన్ని రోజులకే ఇప్పుడు ‘ఇండియన్-2’ అప్‌డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాలో లీడ్ రోల్ అయిన సేనాపతికి సరికొత్తగా ఒక ఇంట్రో రెడీ చేశాడు శంకర్. నవంబరు 3న ఈ టీజర్ రిలీజ్ కాబోతోంది.
ఆ టీజర్ లాంచ్ చేసినపుడే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారట. ‘ఇండియన్-2’ ముందుకు కదులుతోంది.. రిలీజ్ సంగతి తేలబోతోంది అంటే చరణ్ అభిమానుల్లో ఉత్సాహం వస్తోంది. ఆ సినిమా సంగతేదో తేలిపోతే.. ‘గేమ్ చేంజర్’ వేగం పుంజుకుంటుందని.. శంకర్ దీన్ని కూడా త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయిస్తాడని ఆశపడుతున్నారు. ఇంతకీ ‘ఇండియన్-2’ ఇంట్రో టీజర్ ఎలా ఉంటుందన్నదాన్ని బట్టి శంకర్ మునుపటి స్థాయిలో టచ్‌లో ఉన్నాడా లేదా అన్నది కూడా ఒక క్లారిటీ వస్తుంది.
This post was last modified on October 29, 2023 3:39 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…