భారీ అంచనాల మధ్య డివైడ్ టాక్ తోనూ వసూళ్ల దుమ్ము దులిపిన లియో కంటెంట్ విషయంలో ఇప్పటికీ అభిమానులు, మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని మన ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా మార్చిన తీరు బాగానే ఉంది కానీ దాస్ అండ్ కంపెనీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఆశించిన స్థాయిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ డీల్ చేయలేకపోయాడనే కంప్లయింట్ సర్వత్రా వినిపించింది. లియో గతాన్ని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఉంటె రజనీకాంత్ బాషా రేంజ్ లో ఒక ఐకానిక్ మూవీ అయ్యేదని కోలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దీని గురించి లోకేష్ స్పందించాడు. నిన్న జరిగిన కార్తీ జపాన్ ట్రైలర్ లాంచ్ కు అతిథిగా హాజరై ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. లియో సెకండ్ హాఫ్ సాగతీత గురించి తనకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవమేనని, ఒప్పుకుంటానని, ఆ అభిప్రాయాలను సేకరించి మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పాడు. అంతే కాదు లియో కథలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు, డిటైలింగ్ గురించి త్వరలో ఇచ్చే ఇంటర్వ్యూలలో వివరిస్తానని, చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని సస్పెన్స్ పెట్టాడు. సామాన్య ప్రేక్షకులకు లియో నచ్చిందని అందుకే సంతోషంగా ఉన్నానని ఓపెనయ్యాడు.
ఇది ఆహ్వానించాల్సిన స్టేట్ మెంట్. ఎందుకంటే కోట్ల వసూళ్లు వస్తే చాలు తమ సినిమాలో లోపాలను ఒప్పుకోకుండా గొప్పగా తీశామని చెప్పుకునే కొందరు దర్శకుల శైలికి భిన్నంగా లోకేష్ కనగరాజ్ స్పందించడం విశేషం. అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో వాయిదా పడ్డాక ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. దాన్ని పూడ్చేలా అదే వేదికపై త్వరలో సక్సెస్ మీట్ చేయబోతున్నారు. విజయ్ వస్తున్నాడు. ఇది లోకేష్ స్వయంగా చెప్పేశాడు. చెప్పడానికి కార్తీ ఈవెంట్ అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం లియో, రోలెక్స్ అంటూ ఎల్సియు జపంతో స్టేడియంని హోరెత్తించడం అసలు ట్విస్టు.
This post was last modified on October 29, 2023 1:25 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…