డిసెంబర్ 21, 22 వరస తేదీల్లో విడుదల కాబోతున్న షారుఖ్ ఖాన్ డుంకీ, ప్రభాస్ సలార్ ల పోటీకి డిస్ట్రిబ్యూటర్ల బుర్రలు ఎంతగా వేడెక్కిపోయాయో చూస్తున్నాం. వీటి థియేటర్ల సర్దుబాటుకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పెను సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డం రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 20. ఇప్పుడు దాన్ని మార్చేసి నేరుగా 22కి షిఫ్ట్ చేశారు. అంటే సలార్ వచ్చే రోజునే నీటిమనిషి థియేటర్లలో అడుగు పెడతాడు. అంత కొంప మునిగే విషయం ఏంటనా మీ డౌట్.
అక్కడికే వద్దాం. ఇండియాని మినహాయిస్తే ఆక్వామెన్ కి విదేశాల్లో చాలా క్రేజ్ ఉంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, ఐమ్యాక్స్ స్క్రీన్లు చేతిలో ఉన్న పంపిణీదారులు ముందు ఇంగ్లీష్ మూవీకే ప్రాధాన్యం ఇస్తారు. సలార్, డుంకీల డిమాండ్ కళ్ళముందు కనిపిస్తున్నా సరే అంత సులభంగా మాట వినరు. అదే జరిగితే ఓపెనింగ్స్ మీద గట్టి దెబ్బ పడుతుంది. షారుఖ్ కొంత నయం. ఒకరోజు ముందే వస్తాడు కనక రెవిన్యూ పరంగా డ్యామేజ్ మరీ తీవ్రంగా ఉండదు. కానీ ప్రభాస్ పరిస్థితి అలా కాదు. యుఎస్, యుకె లాంటి దేశాల్లో ఆక్వామెన్ తో కలిసి వసూళ్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద సమస్యే.
ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందట క్రిస్మస్ సెలవులకు రిలీజ్ కు తక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవడం కోసమట. అయితే మన దేశం వరకు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా హాలీవుడ్ మూవీ లవర్స్ తప్పించి సలార్, డుంకీలను కాదనుకుని మరీ ఆక్వామెన్ కు వెళ్లే మాస్ జనాలు మన దగ్గర అంతగా ఉండరు. కాకపోతే మల్టీప్లెక్సులు స్క్రీన్లు పంచే విషయంలో ఎలాంటి పోకడ చూపిస్తాయన్నది కీలకం కానుంది. ఎందుకంటే ప్రతి ఊరికి ఒకటి రెండు స్క్రీన్లు ఆక్వామెన్ కు ఇచ్చినా ఆ రకంగా ప్రభాస్, షారుఖ్ కొచ్చే వాటాలో తగ్గినట్టేగా. మొత్తానికి పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.
This post was last modified on October 28, 2023 11:47 am
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…