Movie News

డబుల్ స్ట్రాటజీతో నా సామి రంగా

ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంగా నా సామి రంగా షూటింగ్ జరుగుతోంది. మొదలుపెట్టడంలోనే విపరీతమైన ఆలస్యం జరగడంతో నాగార్జున ఎక్కడ బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా పనులు జరిగేలా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో దిగాలనే లక్ష్యంతో టీమ్ వర్క్ చేస్తోంది. అయితే ఇంత వేగంగా పరుగులు పెట్టడంలో డబుల్ స్ట్రాటజీ ఉందని ఇన్ సైడ్ టాక్. పండగ బరిలో గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ పక్కాగా దిగుతున్నాయి. రవితేజ ఈగల్ పక్కా అని నిర్మాత చెబుతూనే ఉన్నారు కాబట్టి దీని మీద సందేహం అక్కర్లేదు.

వెంకటేష్ సైంధవ్ కి బిజినెస్ కూడా మొదలైపోయింది. ఒక్క శాతం అనుమానం లేదు. రజనీకాంత్ లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలన్ ఎన్నో కొన్ని థియేటర్లు దొరికితే చాలు లెమ్మని వస్తున్నాయి. వాటికి తమిళ వెర్షన్ కీలకం. ఇంత కాంపిటీషన్ మధ్య నా సామీ రంగా దిగితే వర్కౌట్ చేసుకోవడం అంత సులభం కాదు. నాగ్ మాత్రం ఒకటి రెండు ఖచ్చితంగా వాయిదా పడతాయని, ఒకవేళ అదే జరిగితే ఖాళీ అయ్యే ఆ స్లాట్ ని తను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అన్నీ వచ్చే పనైతే డిసెంబర్ లో నిర్ణయం తీసుకుని జనవరి నెలాఖరుకు వెళ్లేలా ఇంకో ప్లాన్ అనుకున్నారట.

మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో సోగ్గాడే చిన్ని నాయనా సెంటిమెంట్ ని వదలకూడదనే నాగ్ పంతం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మలయాళీ రీమేక్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరో రెండు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీళ్ళ ఇమేజ్ దృష్ట్యా మల్టీస్టారర్ అనలేం కానీ ఎంతో కొంత కలర్ అయితే తోడవుతుంది. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నా సామి రంగాలో ఊర మాస్ అంశాలతో పాటు ఒక డిఫరెంట్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. పోరంజు మరియం జొస్ కి రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చాలా మార్పులే చేశారు. ముందైతే ఆయన్నే డైరెక్టర్ గా తీసుకుని తర్వాత మార్చారు. 

This post was last modified on October 27, 2023 7:06 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago