మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కథలు, సన్నివేశాలు కాపీ కొట్టడం కొత్తేమీ కాదు. అగ్ర దర్శకులు చాలామంది ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఎన్నింటిపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయో లెక్కలేదు. ఆయన కాపీ మాస్టర్ అనే విషయం అనేక సినిమాల్లో రుజువైంది కూడా.
కొరటాల శివ సైతం శ్రీమంతుడు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయన తీస్తున్న ఆచార్యకూ ఇలాంటి ఆరోపణలు తప్పలేదు. రాజమౌళి మీద కూడా కొన్ని కాపీ మరకలున్నాయి. ఈ విషయంలో సుకుమార్ మినహాయింపనే చెప్పాలి. ఆయన మీద పెద్దగా కాపీ ఆరోపణలు లేవు. రంగస్థలం క్లైమాక్స్ విషయంలో చిన్న ఆరోపణ వచ్చింది కానీ.. దానికాయన తగు రీతిలో సమాధానం చెప్పాడు.
కానీ ఇప్పుడు సుక్కు తీస్తున్న పుష్ఫ సినిమా కథ విషయమై కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన వేంపల్లి గంగాధర్ తీవ్ర ఆరోపణ చేశాడు. నేరుగా పుష్ప సినిమా కాపీ కథ అనకుండా.. తాను రాసిన ఎర్రచందనం కథ, పుస్తకం ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారంటూ ఆయన ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.
అందులో ఆయన.. ”సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి…ముందుగానే రాసి పెట్టిన కథను ,పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి . తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి …సాక్షి ఆదివారం అనుబంధం( 04 నవంబర్ 2018)లో నేను రాసిన ‘తమిళ కూలీ’ కథ మొత్తం వాడేసుకోండి. గత సంవత్సరం(2019) మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ను ఉడికించి వంట చేస్కోండి .కనీసం పేరుకూడా reference గా సినిమాలో వేయకండి . ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి …మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం’ అని పేర్కొన్నారు.
దీనిపై సుక్కు టీం ఏమంటుందో చూడాలి మరి. కానీ పుష్ప టీజర్ అయినా రాకముందే.. కేవలం అది ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథ అయినంత మాత్రాన.. ఇలా ఆ సినిమా తన రచనల ఆధారంగానే తీస్తున్నారనడం ఎంత వరకు సమంజసమో?
This post was last modified on August 27, 2020 10:06 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…