స్టార్ క్యాస్టింగ్ లేకుండా తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాల విషయంలో ప్రమోషన్ ది చాలా కీలక పాత్ర. ముఖ్యంగా మన కంటెంట్ లో ఎంత దమ్ముందో చెప్పే ట్రైలర్ ఎంతో కీలకం. ఇదే ఒక్కోసారి థియేట్రికల్ బిజినెస్ ని శాశిస్తుంది. లియోనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ముందు తెలుగు హక్కులు ఇరవై ఒక్క కోట్లకు మాట్లాడుకుని రిలీజ్ కు దగ్గరలో అయిదు కోట్లు తగ్గించుకున్నారంటే కేవలం హైప్ లో వచ్చిన హెచ్చుతగ్గుల వల్లే. ట్రైలర్ కట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆశించిన స్థాయిలో ఇవ్వలేదనే కామెంట్స్ నేపథ్యంలో దాని ప్రభావం నేరుగా హక్కుల మీద పడింది. అందరికీ ఇలా జరగదు.
దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం నవంబర్ 17 రిలీజ్ కానుంది. మొన్నటిదాకా దీని గురించి పెద్దగా సౌండ్ లేదు. టీజర్ వచ్చినప్పుడు జనాలు మాట్లాడుకున్నారు. ట్రైలర్ చూశాక ఇదేదో రెగ్యులర్ క్రైమ్ హారర్ డ్రామా కాదని అర్థమైపోవడంతో ఒక్కసారిగా బజ్ పెరిగింది. ముందు ఆరు కోట్లకు పెట్టుకున్న బిజినెస్ టార్గెట్ ఇప్పుడు ఏకంగా రెట్టింపు దాటేసి పదిహేను కోట్లకు చేరుకుందని ట్రేడ్ టాక్. ఆ టైంలో చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోవడంతో పాటు ట్రైలర్ లో చూపించిన విజువల్స్ కి ఇది విరూపాక్షని మించిన విజయం సాధిస్తుందనే నమ్మకం బయ్యర్లలో వచ్చేసిందట.
దీంతో అంత ధర పలుకుతున్నా సరే పంపిణీదారులు సిద్ధంగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన మంగళవారంలో అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తోంది. పబ్లిసిటీలో వీలైనంత స్టోరీకి సంబంధించి లీకులు రాకుండా అజయ్ భూపతి జాగ్రత్త తీసుకోవడంతో అంతకంతా ఆసక్తి పెరుగుతోంది. ఒక ఊరిలో జరిగే అంతుచిక్కని హత్యలకు, కనిపించని దెయ్యాలకు, కామంతో రగిలిపోయే ఒక అమ్మాయికి మధ్య జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ గా మంగళవారం రూపొందింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో అయిదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
This post was last modified on October 26, 2023 4:38 pm
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్‌డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…