పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న ఓజి షూటింగ్ ప్రస్తుతం చిన్న బ్రేక్ లో ఉంది కానీ దర్శకుడు సుజిత్ మిగిలిన పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నాడు. హీరో డేట్లు ఇవ్వడం ఆలస్యం వీలైనంత ఎక్కువ భాగం తీసేసి రిస్క్ లేకుండా చూసుకుంటున్నాడు. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా డివివి సంస్థ శుభాకాంక్షలు చెబుతూ ఓజిని ఈ ఏడాది పేల్చి పారేద్దాం అంటూ ట్వీట్ చేసింది. సాధారణంగా విడుదలను ఉద్దేశించి ఇలాంటి మాటలు వాడతారు. అంటే డిసెంబర్ లో ఓజి రావడం పక్కా ఏమోనని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం మొదలుపెట్టారు.
కానీ ఏ కోణంలో చూసినా ఇది సాధ్యమయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకంటే ఇంకా షూట్ చాలా బాలన్స్ ఉంది. డిసెంబర్ మొదటి వారంలో హాయ్ నాన్న, గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు ఉన్నాయి. వీటికి థియేటర్ల సర్దుబాటు చేయడమే పెద్ద తలనెప్పి. ఒకవేళ నిజంగా ఓజి కనక ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే వీళ్ళు తప్పుకోవడం ఖాయం. కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు హడావిడిగా రిలీజ్ ప్లాన్ చేసుకోరు. పైగా అంచనాలు విపరీతంగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ ని చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది.
సో లేనిపోని ఆశలు పెట్టుకోవడం కన్నా ఓజి వచ్చే ఏడాదే విడుదలవుతుందని ప్రిపేర్ కావడం అవసరం. ఏదో ఫ్లోలో పేల్చేద్దాం అన్నారు కానీ ఆచరణలో మాత్రం సులభం కాదు. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ఓజిని దగ్గరలో చూడలేం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముందు డిసెంబరే అనుకున్న మాట వాస్తవం. అయితే చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత జనసేన కోసం పవన్ ఇంకా ఎక్కువగా రాజకీయ కార్యకలాపాలు చేయాల్సి వచ్చింది. దాంతో ఆ ప్రభావం నేరుగా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ల మీద పడింది. ఎన్నికల ముందే ఏదో ఒక సినిమా థియేటర్లలో రావడం పక్కానే. అదేంటంటేది తేలాలి.
This post was last modified on October 26, 2023 11:47 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…