టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కెమెరామెన్స్ లో ఛోటా కె నాయుడుది ముందు వరస. అయితే మెగా 156కి ఆయన పేరుని ప్రకటించినప్పటి నుంచి చిరు ఫ్యాన్స్ లో ఒకరకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన్ను మార్చమని, కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మితతో పాటు ఇద్దరినీ పంపేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇది జరిగే పని కాదు కానీ నిజానికి చోటా సీనియారిటీ ఎన్నో సినిమాలకు అద్భుతంగా పని చేసింది. అంతెందుకు డిజాస్టర్ అయ్యింది కానీ పెదకాపు 1లో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ విషయం సినిమాటోగ్రఫి మాత్రమే. శ్రీకాంత్ అడ్డాల ఆలోచనలను మించి తెరమీద విజువల్స్ ని ఆవిష్కరించారు.
దర్శకుడు వశిష్ట కోరిమరీ చోటానే తీసుకోవడానికి కారణం ఉంది. డెబ్యూ మూవీ బింబిసారకు ఆయన పనితనం అవుట్ ఫుట్ కు బాగా తోడ్పడింది. అయితే ఓల్డ్ స్కూల్ కు చెందిన చోటా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు అప్ డేటెడ్ వర్క్ ఇవ్వడం లేదనేది అభిమానుల వెర్షన్. ఉదాహరణకు నాయక్, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాలు చూస్తే వాటిలో అవసరానికి మించి ఆర్టిస్టుల క్లోజ్ అప్ షాట్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. అలా అని అలాంటివికి ప్రతిదాంట్లోనూ లేవు. టైగర్, జై లవకుశలో క్వాలిటీ బాగుంటుంది. అందుకే కొందరు ఏరికోరి మరీ చోటానే తీసుకోవడం చూస్తున్నాం.
ఇక చిరంజీవితో నాయుడుకి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మాస్టర్, చూడాలని ఉంది, అన్నయ్య, డాడీ, ఠాగూర్, అంజి ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి. ఒకటి రెండు తప్ప అన్ని బెస్ట్ వర్క్సే. మరి ఇంత సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్ కావడం మంచిదేగా. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం రత్నవేలు, సెంథిల్, మాది, మనోజ్ పరమహంస లాంటి వాళ్ళను డిమాండ్ చేస్తున్నారు. మెగా 156 భారీగా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడిన మూవీ కావడంతో వాళ్ళ డిమాండ్ సబబే కానీ చోటాని మరీ తక్కువంచనా వేయడం సరికాదు. వాళ్ళ అనుమానం తీరాలంటే ఇంకో ఏడాది దాకా ఎదురు చూడక తప్పదు.
This post was last modified on October 26, 2023 7:19 am
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…