శివమణి.. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. మరీ బ్లాక్ బస్టర్ ఏమీ అయిపోలేదు కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చింది.
‘‘నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్’’ అనే పూరి మార్కు డైలాగ్ భలేగా పేలింది. సినిమాలో నాగార్జున క్యారెక్టరైజేషన్, ఆయన డైలాగులు సూపర్ పాపులర్ అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నాడు. ‘శివమణి’లో పూర్ణా మార్కెట్ ఏరియాకు కొత్త సీఐగా వచ్చిన నాగ్.. రౌడీలందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చే ఒక సన్నివేశం ఉంటుంది. చాలా సరదాగా సాగిపోయే ఆ సన్నివేశాన్ని ఇప్పటి కరోనా కల్లోల పరిస్థితులకు తగ్గట్లు స్పూఫ్ చేశారు. మిమిక్రీ ఆర్టిస్టు భవిరి రవి నాగ్ వాయిస్‌ను ఇమిటేట్ చేసిన వీడియో ఇది.
సినిమాలో రౌడీయిజం మానేయమని నాగ్ వార్నింగ్ ఇస్తే.. మాస్కులు పెట్టుకోండి, బయట గుంపులు గుంపులుగా తిరక్కండి అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు మిమిక్రీ చేశారు. ఏదో మొక్కుబడిగా కాకుండా సినిమాలో డైలాగులకు తగ్గట్లే ఫన్నీగా డైలాగులు రాశారు. కొన్ని రోజులుగా ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నాగ్ వరకు వెళ్లింది. దీన్ని నాగ్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ.. ఇప్పుడు కనుక ‘శివమణి’ సినిమా తీస్తే పూరి జగన్నాథ్ డైలాగులు సరిగ్గా ఇలాగే ఉండేవని కామెంట్ చేశాడు.
దీనిపై పూరి సైతం స్పందించాడు. ఇది సూపర్‌గా ఉంది అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ వీడియోకు మరింత పాపులారిటీ వచ్చింది. నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తుండగా.. పూరి విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘శివమణి’ తర్వాత కలిసి పని చేయని నాగ్, పూరి భవిష్యత్తులో ఏమైనా ఇంకో సినిమా చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 25, 2020 4:05 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…