Movie News

గుంటూరు కారంలో రాజకీయ ఘాటు

జనవరి సంక్రాంతి పండగను లక్ష్యంగా పెట్టుకుని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. నిర్మాత నాగవంశీ ఆ మధ్య దసరాకు టాకీ పార్ట్ పూర్తవుతుందని అన్నారు కానీ వాస్తవానికది సాధ్యపడలేదు. మధ్యలో కొందరు కీలక ఆర్టిస్టుల డేట్ల సమస్య వల్ల చిన్న చిన్న బ్రేకులు తప్పలేదు. ఇంకా పాటలు బాలన్స్ ఉన్నాయి. భగవంత్ కేసరి ప్రమోషన్ల కోసం వారం రోజులకు పైగా డేట్లు కేటాయించిన శ్రీలీల ఇప్పుడా హడావిడి పూర్తయిపోవడంతో తిరిగి మహేష్ తో జత కట్టనుంది. ఇంతకీ సాంగ్స్ షూట్ ఎప్పుడు అయిపోతుందనేది సస్పెన్స్ గానే ఉంది.

అసలు విషయానికి వస్తే లీకవుతున్న టాక్ ప్రకారం గుంటూరు కారంలో రాజకీయ ఘాటు ఎక్కువగానే ఉందట. అయితే వివాదాస్పద అంశాలు లేకుండా కేవలం హీరోయిజం కోణంలోనే హైలైట్ అయ్యేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ ఫుల్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా మహేష్ ప్రత్యర్థి పొలిటికల్ మీటింగ్ జరుగుతున్న పబ్లిక్ ప్లేస్ కి వెళ్లి బీడీ కాల్చుకుంటూ మరీ శత్రువుకి వార్నింగ్ ఇచ్చే సీన్ చాలా గొప్పగా వచ్చిందని టీమ్ సభ్యులు ఊరిస్తున్నారు. మహేష్ తాతయ్యగా నటిస్తున్న ప్రకాష్ రాజ్ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

టైటిల్ ఏదో మసాలా సినిమాలా అనిపించినా గుంటూరు వాస్తవ్యులైన హీరో కుటుంబానికి ఉండే పొలిటికల్ బ్యాక్ డ్రాపే ప్రధానాంశంగా ఉంటుందని అంటున్నారు. పోకిరి, ఒక్కడు, బిజినెస్ మెన్ తర్వాత మళ్ళీ అంత స్థాయిలో ఎలివేషన్లు మహేష్ కు పడలేదు. భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద హిట్ అయినా అవి ఎంతో కొంత లోటుతోనే బ్లాక్ బస్టరయ్యాయి. కానీ ఈసారి అంచనాలకు మించి గుంటూరు కారంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయట. నాగవంశీ ప్రతిసారి అంత కాన్ఫిడెంట్ గా కనిపించడానికి కారణం కూడా అదే అంటున్నారు. చూద్దాం.

This post was last modified on October 25, 2023 6:06 pm

Share

Recent Posts

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

2 minutes ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

29 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

29 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

4 hours ago