Movie News

సంపూకు దొరికిన లక్కీ ఛాన్స్

పండగ సినిమాల హడావిడి అయిపోయింది కాబట్టి మూవీ లవర్స్ కొత్త శుక్రవారం వైపు ఎదురు చూస్తున్నారు. అయితే స్టార్ లెవరూ రాకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమే అయినా గ్రౌండ్ గా ఫ్రీగా ఉన్న అవకాశం వాడుకునే ఛాన్స్ సంపూర్ణేష్ బాబుకి దక్కింది. తను హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. పది రోజుల క్రితమే కొన్ని జిల్లా కేంద్రాల్లో స్పెషల్ షోలు వేశారు. హైదరాబాద్ లో ఇవాళ మీడియాకు ప్రదర్శించారు. రేపు సాయంత్రం కొన్ని షోలు రెగ్యులర్ ఆడియన్స్ కి ప్లాన్ చేస్తారట. ఇప్పటికైతే ప్రీ రెస్పాన్స్ పాజిటివ్ గానే వినిపిస్తోంది.

ప్రీమియర్ల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకోలేం కాబట్టి 27 ఉదయం ఓ రెండు షోలు పడి కామన్ పబ్లిక్ చూశాక క్లారిటీ వస్తుంది. తమిళ హిట్ మూవీ మండేలా రీమేక్ గా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ లో హాస్యంతో పాటు సామాజిక కోణంలో సీరియస్ గా చర్చించిన అంశం ఒకటుంది. ఓటు గొప్పదనం తెలియజేయడంతో పాటు దాన్ని అమ్ముకుని జనాలెంత తప్పు చేస్తున్నారో ఇందులో చూపించారు. ప్రస్తుతమున్న అధికార పార్టీల మీద కూడా కొన్ని సెటైర్లు ఉన్నాయని ట్రైలర్ లోనే హింట్ ఇచ్చారు. కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దీనికి సంభాషణలు అందించారు.

ఇక పోటీ పరంగా చూస్తే ఆ రోజు చిన్న సినిమాలు తప్ప ఇంకేవి లేదు. ఉన్నవాటిలో కొంత ఆసక్తి రేపుతోంది మార్టిన్ లూథర్ కింగ్ ఒకటే. లింగోచా, ధీమహి, శివరాజ్ కుమార్ ఘోస్ట్, ఒక్కడే 1 ఇలా కొన్నున్నాయి కానీ అదిరిపోయిందనే టాక్ వస్తే తప్ప ఓపెనింగ్స్ సంగతి తర్వాత, ముందు పికప్ కావడానికి ఛాన్స్ ఉండదు. కాకపోతే మార్టిన్ లూథర్ కింగ్ నెలాఖరులో రావడం, పండగ సందడిలో చాలా మంది బాలయ్య, రవితేజ, విజయ్ సినిమాలు చూసేయడంతో సంపూ కోసం ఏ మేరకు వస్తారో చూడాలి. ఇప్పుడంతా కంటెంట్ రాజ్యం కాబట్టి అదొక్కటి బలంగా ఉందనిపించుకుంటే చాలు గట్టెక్కినట్టే. 

This post was last modified on October 25, 2023 4:02 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago