ఇప్పుడు దక్షిణాదిన బెస్ట్ సింగర్ ఎవరు అంటే మరో మాట లేకుండా సిద్ శ్రీరామ్ పేరు చెప్పేయొచ్చు. అతడి వాయిస్‌లోని ప్రత్యేకత.. తన పాటలకు వస్తున్న పాపులారిటీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తన పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్‌లో. సిద్ శ్రీరామ్ పాట పాడితే.. దాన్ని చూపించి సినిమాను ప్రమోట్ చేసుకునే పరిస్థితి ఉంటోంది. గీత గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలే పాటతో మొదలుపెట్టి.. ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడతను. తాజాగా సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ నుంచి సిద్ పాడిన ఇది నేనేనా అనే పాట రిలీజైంది. దీనికి కూడా మంచి స్పందన వచ్చింది. సిద్ హిట్ పాటల జాబితాలో ఇదీ చేరిపోయింది.
కానీ ఈ పాటలో తెలుగు పదాల్ని సిద్ పలికిన వైనం మాత్రం భాషా ప్రియులకు ఏమాత్రం నచ్చడం లేదు. సిద్ ఎప్పుడూ కూడా శ అక్షరాన్ని సరిగ్గా పలకడు. స అనే అంటాడు. ఈ పాటలో మొత్తం అలాగే చేశాడు. అవసరం లేని చోట దీర్ఘాలు తీసి.. దీర్ఘాలుండాల్సిన చోట హ్రస్వాల్లా పలికి తెలుగు పదాలతో ఒక ఆట ఆడేసుకున్నాడు సిద్. దీని గురించి తెలుగు ప్రియులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఈ పాట అనే కాదు.. సిద్ పాడిన తెలుగు పాటలన్నింటిదీ ఇదే వరుస. సీతారామశాస్త్రి లాంటి దిగ్గజ రచయిత రాసిన సామజవరగమనలోనూ కొన్ని తప్పులు దొర్లాయి. అందం అమ్మాయైతే పాటులో శశి, నిశి లాంటి పదాలను ససి, నిసి అని పలికాడతను. గాత్రం, గానం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ తెలుగు పదాల విషయంలో మాత్రం సిద్ అన్యాయం చేస్తున్నాడు. ఈ విషయంలో సిద్ మాత్రమేకాదు.. అతడితో పని చేసే సంగీత దర్శకులు, గేయ రచయితలు కాస్త శ్రద్ధ పెడితే మంచిదేమో.
This post was last modified on August 27, 2020 2:01 am
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…