దసరా కానుకగా రిలీజైన లియో సినిమా సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైన మాట వాస్తవం. కానీ ముందస్తు హైప్ వల్ల, డివైడ్ టాక్ తట్టుకుని మంచి వసూళ్లే సాధిస్తున్నట్లు కనిపించింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తోందని లియో గురించి గొప్పలు పోయారు. యుఎస్‌లో ఏకంగా 18 మిలియన్ డాలర్లకు పైగా ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వరల్డ్ వైడ్ రూ.300 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ ఫిగర్స్ అన్నీ ఎగ్జాజరేటెడ్ అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. యుఎస్ వసూళ్ల విషయంలో ట్రాకింగ్ పక్కాగా ఉంటుందని అంటారు కానీ.. అక్కడ ట్రేడ్ పండిట్లను మేనేజ్ చేశారని.. అలాగే ప్రాక్సీ బుకింగ్స్‌తో సినిమాకు లేని హైప్ సృష్టించారని అంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూపించి.. జనాల్లో హైప్ క్రియేట్ చేశారని.. ఇదంతా పెద్ద స్కామ్ అని అంటున్నారు. తమిళనాడులో సైతం వాస్తవ వసూళ్ల కంటే ప్రకటించిన ఫిగర్స్ చాలా ఎక్కువ అని.. సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మించడానికే ఇదంతా జరిగిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. నిన్నట్నుంచి ట్విట్టర్లో లియో స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీని మీద బోలెడన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. దసరా పండుగ రోజు కూడా సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదని.. మంగళవారం నుంచి సినిమా పూర్తిగా పడుకున్నట్లే అని అంటున్నారు.
This post was last modified on October 25, 2023 9:27 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…