మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు దసరా సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించబోయే చిత్రమిది. చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని చిత్ర వర్గాలు ఇంతకుముందే వెల్లడించాయి. చిరు కెరీర్లోనే అత్యధికంగా రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు.
ఇంతకుముందు అనుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాను పక్కన పెట్టి మరీ ఈ భారీ చిత్రాన్ని తన 156వ సినిమాగా చేస్తున్నాడు చిరు. ఇది అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. కానీ ఈ సినిమాకు ఎంచుకున్న సాంకేతిక నిపుణులు కొందరి విషయంలో మాత్రం మెగా అభిమానులు అంత సంతృప్తిగా లేరు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది చిరు తనయురాలు సుశ్మిత కొణిదెల విషయంలోనే.
చిరు రీఎంట్రీలో చాలా సినిమాలకు సుశ్మితనే కాస్ట్యూమ్స్ సమకూర్చింది. ఐతే చిరు స్టైలింగ్ ట్రెండీగా లేదని ఫ్యాన్సే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా భోళా శంకర్‌కు సుశ్మిత సమకూర్చిన కాస్ట్యూమ్స్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వశిష్ఠతో చేస్తున్నది భారీ బడ్జెట్ సినిమా. అది కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్నది. ఇలాంటి వాటిలో కాస్ట్యూమ్స్ చాలా కీలకం. అలాంటపుడు ఏ నీతా లుల్లా లాంటి వాళ్లనో తీసుకోవాలి. లేదంటే రమ రాజమౌళి లాంటి వాళ్లయితే ఓకే.
కానీ రమ రాజమౌళి సినిమాలకే పరిమితం. ఆమె అందుబాటులో లేనపుడు ఇంకెవరైనా పేరున్న కాస్ట్యూమ్ డిజైనర్‌ను తీసుకోవాలి కానీ.. సుశ్మితకు ఇంత పెద్ద బాధ్యత ఎలా అప్పగించారని.. ఇక్కడ చిరు పుత్రికా ప్రేమను పక్కన పెట్టాల్సిందని అంటున్నారు ఫ్యాన్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడి విషయంలోనూ ఫ్యాన్స్ సంతృప్తగా లేరు. ఛోటా సినిమాటోగ్రఫీ కొంచెం పాత స్టయిల్లో ఉంటుందని.. రత్నవేలు, మధీ, రవిచంద్రన్ లాంటి వాళ్లను ట్రై చేసి ఉండాల్సిందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 25, 2023 9:05 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…