‘జైలర్’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న కనిపించేది కొన్ని నిమిషాలే. కానీ ఆయన చేసిన నరసింహ పాత్రకు మామూలు రెస్పాన్స్ రాలేదు. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారీ విజిల్స్ మోత మోగిపోయింది థియేటర్లలో. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రజినీ భార్యను, కోడలిని కాపాడేందుకు సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే సీన్లో శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చింది.
ఈ సినిమాలో కనిపించిన షార్ట్ రన్ టైంతోనే కొత్తగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు శివన్న. తన పాత్రకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని అంటున్నాడు శివన్న. సినిమాలో తాను చేసిందేమీ లేదని.. తన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి తన భార్య కూడా ఆశ్చర్యపోయిందని.. ఆ క్యారెక్టర్‌కు సంబంధించి క్రెడిట్ అంతా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌దే అని శివన్న వ్యాఖ్యానించాడు.
‘‘జైలర్‌లో నేను చేసిన నరసింహ పాత్రకు అంత స్పందన వచ్చిందంటే కారణం దర్శకుడు నెల్సనే. నా పాత్రకు సంబంధించి నిజానికి జైలు నేపథ్యంలో ఒక సీక్వెన్స్ తీయాల్సింది. కానీ అది సినిమాకు అవసరం లేదని తీసేశారు. తన సినిమాల్లో గ్రే క్యారెక్టర్లను నెల్సన్ బాగా చూపిస్తాడు. నాకు ఇలాంటి పాత్ర ఇస్తారని అసలు ఊహించలేదు.
ఇదొక సర్ప్రైజ్. రిలీజ్ తర్వాత నా భార్య నా దగ్గరికి వచ్చి.. ‘‘మీరేం చేశారని ఇంత రెస్పాన్స్ వస్తోంది’’ అని ఆశ్చర్యపోతూ అడిగింది. నాకూ తెలియదని సమాధానం ఇచ్చా. ప్రేక్షకులకు ఎప్పుడు, ఏది నచ్చుతుందో చెప్పలేం. ఈ ిసనిమా కథ, నెల్సన్ టేకింగ్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. నా పాత్ర ఇంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని శివరాజ్ కుమార్ పేర్కొన్నాడు. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన ‘జైలర్’ వరల్డ్ వైడ్ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే..
This post was last modified on October 24, 2023 8:12 pm
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…