Movie News

మంగ‌ళ‌వారం టైటిల్.. అలా చూడొద్దు

ఆర్ఎక్స్ 100తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. త‌న తొలి చిత్రానికి వెరైటీ టైటిల్  పెట్టిన అజ‌య్.. రెండో సినిమాకు మ‌హాస‌ముద్రం అనే మంచి వెయిట్ ఉన్న టైటిల్ పెట్టాడు. కానీ అది స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేదు. మూడో చిత్రానికి మంగ‌ళ‌వారం అనే మ‌రో డిఫ‌రెంట్ టైటిల్ పెట్టాడు. ఈ సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌ల‌గ‌డానికి తొలి కార‌ణం టైటిలే. ఆ టైటిల్‌తో ముడిప‌డి ఒక బూతు సామెత ఉండ‌టంతో.. బోల్డ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న అజ‌య్ భూప‌తి ఆ కోణంలోనే టైటిల్ పెట్టాడేమో అన్న సందేహాలు క‌లిగాయి.

కానీ మంగ‌ళ‌వారం ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో టైటిల్ విష‌య‌మై అత‌ను వివ‌ర‌ణ ఇచ్చాడు. అంద‌రూ అనుకుంటున్న బూతు సామెతకు ఈ టైటిల్‌కు ఏ సంబంధం లేద‌ని అజ‌య్ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. సోష‌ల్ మీడియాలో టైటిల్ గురించి ర‌క‌ర‌కాలుగా అనుకుంటుండ‌టం చూశాన‌ని.. కానీ సినిమా చూస్తే ఆ ప్ర‌చారాల‌కు టైటిల్‌కు సంబంధం ఏమీ లేద‌ని అర్థ‌మ‌వుతుంద‌ని అజ‌య్ తెలిపాడు. ఈ చిత్రానికి ఇది యాప్ట్ టైటిల్ అని.. రేప్పొద్దున సినిమా చూసిన‌పుడు అది ప్రేక్ష‌కుల‌కు బాగా అర్థ‌మ‌వుతుంద‌ని అజ‌య్ తెలిపాడు.

ఇక ఈ సినిమా క‌థ గురించి చెబుతూ.. ఇండియాలో ఇప్ప‌టిదాకా ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌ను తాను ట‌చ్ చేశాన‌ని న‌మ్ముతున్నాన‌ని అజ‌య్ తెలిపాడు. ఆర్ఎక్స్ 100లో ఒక కొత్త క‌థ‌ను చూసి ప్రేక్ష‌కులు గొప్ప‌గా ఆద‌రించార‌ని.. మంగ‌ళ‌వారం సినిమాలో కూడా అలాంటి కొత్త క‌థ‌నే చూసి ఆడియ‌న్స్ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్మ‌కం ఉంద‌ని అజ‌య్ తెలిపాడు. త‌న రెండో సినిమా మ‌హాస‌ముద్రం ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ.. అది తీసింది కూడా తానే కాబ‌ట్టి దాన్ని ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. అందుకే పోస్ట‌ర్ మీద ఆ సినిమా పేరు కూడా వేశాన‌ని అజ‌య్ చెప్పాడు. త్వ‌ర‌లో తాను కార్తికేయ హీరోగా ఓ భారీ చిత్రం చేయ‌నున్న‌ట్లు అజ‌య్ వెల్ల‌డించాడు.

This post was last modified on October 22, 2023 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago