Movie News

డైరెక్టర్ ఒక్క నిమిషం పాత్ర.. అదీ స్టోరీ

‘లియో’ సినిమాలో బోలెడంతమంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ హీరో సహా ఎవ్వరికీ సరైన పాత్రను డిజైన్ చేయలేకపోయాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. సంజయ్ దత్, అర్జున్ లాంటి పెద్ద నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు. కానీ ఆ పాత్రలన్నింటినీ తేల్చిపడేశాడు. ఇక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను కేవలం ఒక్క నిమిషం కనిపించే పాత్రకు ఎందుకు తీసుకున్నాడో అసలు అర్థం కాలేదు.

ఇలా కాలిస్తే అలా చచ్చిపోయే అది. కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. ఆ మాత్రం దానికి ఏ జూనియర్ ఆర్టిస్టునో పెట్టుకోకుండా.. అనురాగ్‌తో ఎందుకు ఆ సీన్ చేయించారో ప్రేక్షకులకు అంతుబట్టలేదు. దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఐతే అనురాగ్‌తోనే ఆ పాత్ర చేయించడం వెనుక వేరే కథ ఉందట.

గతంలో అనురాగ్ కశ్యప్ ‘ఇమైక్క నోడిగల్’ అనే సినిమాలో సైకో విలన్ పాత్ర చేశాడు. నయనతార లీడ్ రోల్ చేసిన ఆ సినిమా పెద్ద హిట్టయింది. తమిళ సినిమాల పట్ల ముందు నుంచి అనురాగ్‌కు ఆసక్తి ఉంది. అతడికి లోకేష్ కనకరాజ్ సినిమాలు తెగ నచ్చేశాయట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోకేష్ సినిమాలో చచ్చిపోయే సీన్ ఒకటి చేయాలని ఉందని యథాలాపంగా చెప్పాడట.

ఈ ఇంటర్వ్యూ చూసిన లోకేష్.. అనురాగ్‌కు ఫోన్ చేసి మీరు సరదాకి ఆ మాట అన్నారా అని అడిగితే.. నిజంగానే తనకు అలా ఒక సీన్ చేయాలని ఉందని చెప్పాడట అనురాగ్. దీంతో ‘లియో’ సినిమాలో ఒక పాత్ర చచ్చిపోయే చిన్న సీన్ ఉంటే.. దాన్ని అనురాగ్‌తో చేయించాడట. తాను ఒక పూట ముంబయి నుంచి చెన్నైకి వస్తే.. మూడు గంటల్లో ఆ సీన్ పూర్తి చేసి తనను తిరిగి ఫ్లైట్ ఎక్కించేశారని అనురాగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అనురాగే ఏరి కోరి ఈ చిన్న సీన్ చేశాడు కాబట్టి అతడి పాత్ర అలా ఉండటం గురించి ఎవ్వరూ ఫీలవ్వాల్సిన పని లేదు.

This post was last modified on October 21, 2023 3:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago