బాక్సాఫీస్ దగ్గర లియో జోరు బాగానే ఉంది కానీ డివైడ్ టాక్ కొనసాగుతున్న మాట వాస్తవం. తమిళం సంగతి పక్కనపెడితే తెలుగులో అంచనాలు అందుకోలేదని ఫ్యాన్స్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పండగ సీజన్ తో పాటు వరస సెలవులు, లోకేష్ కనగరాజ్ టేకింగ్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, విజయ్ ఇమేజ్ ఇవన్నీకలెక్షన్లు పడిపోకుండా నిలబెడుతున్నాయి. భగవంత్ కేసరి మాస్ ని ఫ్యామిలీస్ ఆకట్టుకుంటున్నా లియో వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు. అది థియేటర్లలో జనాన్ని చూస్తే అర్థమైపోతుంది. వచ్చే బుధవారం దాకా ఇలాగే స్టడీగా ఉండే అవకాశాలను కొట్టి పారెయలేం.
మొదటి రోజు వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్లు కలిపి 148 కోట్ల గ్రాస్ వచ్చినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ లో ఇదే నెంబర్ వన్. ఏపీ తెలంగాణలో 16 కోట్లు వచ్చాయి. ఒకవేళ లియో కనక విక్రమ్, ఖైదీ రేంజ్ టాక్ తెచ్చుకుని ఉంటే ఏం జరిగేదంటే ఊహించుకోవడం కష్టమే. కెజిఎఫ్ ని లక్ష్యంగా పెట్టుకునేంత స్టామినా దీనికి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలు లేకుండానే సులభంగా వంద కోట్లు దాటేసి డివైడ్ టాక్ తోనూ రెండో రోజు స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం అంటే మాటలు కాదు. మేనియా ఆ రేంజ్ లో ఉంది మరి.
ఇదంతా లోకేష్ దృష్టికి వెళ్లకుండా ఉండదు. నెక్స్ట్ చేయబోయే రజనీకాంత్ సినిమాకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. లియోకి ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పాడు. మరి తలైవర్ కు కొత్త కథ రాసుకున్నాడా లేక మళ్ళీ ఇన్స్ పిరేషన్ అంటాడా వేచి చూడాలి. ఏది ఏమైనా విజయ్ మార్కెట్ పెరిగిపోయిన విషయాన్ని లియో మరోసారి స్పష్టం చేసింది. ఈసారి తుపాకీ లాంటి సబ్జెక్టు, దర్శకుడు దొరికితే మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను టార్గెట్ చేసుకోవచ్చు. అభిమానులు మాత్రం రాజమౌళి కాంబోని కోరుకుంటున్నారు. అది మాత్రం జరగని పనే. జక్కన్న తెలుగుకే సొంతం.
This post was last modified on October 21, 2023 10:37 am
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…