Movie News

రేణు దేశాయ్ రీఎంట్రీ ఫలితం దక్కిందా

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలతో జీవితం గడిపేస్తున్న రేణు దేశాయ్ ఇరవై సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చారు. స్టువర్ట్ పురంని అభివృద్ధి చేసి అక్కడి దొంగల్లో మార్పు రావాలని తపించే సామజిక కార్యకర్త హేమలత లవణంగా ప్రాధాన్యత కలిగిన పాత్రే దక్కినప్పటికీ తెరమీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆవిడ రీ ఎంట్రీ మంచి జ్ఞాపకాన్ని ఇవ్వడం కష్టమే. ఇవాళ థియేటర్లలో ఆమె ఎంట్రీకి సైతం జనంలో కేకలు, విజిల్స్ వినిపించడం ఆశ్చర్యం. అవి ఎవరి నుంచి వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రేణు దేశాయ్ చిన్ని తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరించడమే కాక అవకాశం వీలు ఉన్నప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. టైగర్ నాగేశ్వరరావులో తెల్లచీర, డీ గ్లామర్ లుక్ తో మొహంలో కళ లేని ఒక నిస్సత్తువ లుక్ ఇవ్వడం వల్ల ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఫ్యాన్స్ రమ్యకృష్ణ, మధుబాల, విజయశాంతి, ఇంద్రజ, నదియా తరహాలో పెద్దరికం, హుందాతనంతో పాటు తెరమీద చక్కగా ఆవిష్కరించే పాత్రల్లో చూడాలని కోరుకున్నారు. టైగర్ కథ విని ఇన్స్ ఫైర్ అయ్యానని రేణు దేశాయ్ గొప్పగా చెప్పారు.

ఫలితం గురించి కాసేపు పక్కనపెడితే ఇకపై యాక్టింగ్ కొనసాగిస్తారో లేదో చూడాలి. 2003 జానీ తర్వాత మళ్ళీ ఆవిడ మేకప్ వేసుకోలేదు. పూర్తిగా ఫ్యామిలీ కోసం టాలీవుడ్ కు దూరంగా ఉన్నారు. నిర్మాత, దర్శకురాలిగా మరాఠిలో ఇష్క్ వాలా లవ్ తీశారు తప్పించి అంతకు మించి యాక్టివిటీ లేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్టులకు తెలుగులో డిమాండ్ ఉంది. నటన కొనసాగించేది లేనిది స్పష్టంగా చెప్పకపోయినా తరచు కనిపించడం పట్ల ఆసక్తిగా ఉన్నారని ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతం డివైడ్ టాక్ తో బోణీ మొదలుపెట్టింది. 

This post was last modified on October 20, 2023 8:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

38 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago