ప్రస్తుత సమాజంలో మృగం మనిషి కలిసిన మృగాళ్లు ఎక్కువైపోయారు. తమ కామ వాంఛ తీర్చుకోవడం కోసం వయసు తారతమ్యం లేకుండా మూడేళ్ళ పాపతో మొదలుపెట్టి పండుముసలి దాకా అందరి మీద అఘాయిత్యాలకు ఒడిగడుతున్న తీరు నిత్యం పేపర్లు, న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. అయినా చట్టంలోని లొసుగులను వాడుకుని నిందితులు నిర్భయంగా బయటికి వచ్చి తిరిగి మళ్ళీ తెగబడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఇందులో మాత్రం మార్పు లేదు. భగవంత్ కేసరిలో ఈ సున్నితమైన అంశం గురించి చెప్పిన తీరు చప్పట్లు అందుకుంటోంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలక ఎపిసోడ్లో బాలయ్య ఓ స్కూల్ కు వెళ్లి పసిపాపలు చిన్నతనం నుంచే తమకు ఎదురయ్యే లైంగిక స్పర్శలకు ఎలా స్పందించాలి, తల్లికి ఎలా చెప్పాలనే దాని గురించి హత్తుకునేలా ప్రసంగిస్తాడు. వరస ఏదైనా సరే ఆఖరికి తండ్రైనా తప్పని చెప్పే హక్కు అందరికీ ఉంటుందని చెప్పిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి సూటిగా తాకుతోంది. నిజానికి ఇలాంటి విషయాలు తరచుగా సినిమాల్లో చర్చిస్తూ ఉండాలి. అప్పుడే తల్లితండ్రులకు పిల్లలకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దాని మీద స్పష్టత వస్తుంది. స్కూళ్లలో కూడా ఇలాంటివి అమలు పరచాలి.
ఈ పాయింట్ నే అనిల్ రావిపూడి సూటిగా సంభాషణల రూపంలో బాలయ్యతో చెప్పించాడు. శ్రీలీల పాత్ర మానసికంగా, శారీరకంగా రాటు దేలడానికి లింక్ పెట్టిందే అయినా ఈ సీన్ జరుగుతున్న కాసేపు పిల్లల పేరెంట్స్ మనసులు భావోద్వేగంతో నిండిన మాట వాస్తవం. బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి ఏ స్థాయి విజయం, ఫలితం అందుకుంటాడనేది తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు ఎదురు చూడాలి. లియో వీక్ అయ్యేలా ఉంది. టైగర్ నాగేశ్వరరావు టాక్ ని బట్టి బాలయ్య దూకుడు మరింత పెరుగుతుందా లేక ఉన్నదే కొనసాగుతుందా అనేది డిసైడ్ అవుతుంది.
This post was last modified on October 20, 2023 12:03 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…