గత వారం పది రోజులుగా లియో విడుదల దగ్గరగా పెట్టుకుని రామ్ చరణ్ క్యామియో గురించి ఎంత విపరీత ప్రచారం జరిగిందో చూస్తూనే ఉన్నాం. మా సైట్ నిర్ధారణగా గత వారమే ఎలాంటి అతిధి పాత్రలు లేవని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఇవాళ థియేటర్లలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని కొన ఆశతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. చరణ్ కాదు కదా కనీసం వాయిస్ ఓవర్ కూడా లియోలో లేదు. కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్ లలో ఒకరు కనిపించవచ్చన్న అంచనా కూడా తప్పయ్యింది. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని క్లారిటీ వచ్చేసింది.
నిజానికి ఈ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతున్నా, లియోకు పనిచేసిన కొందరు టీమ్ సభ్యులు పలు ఇంటర్వ్యూలలో చెప్పినా ప్రొడక్షన్ హౌస్ పట్టించుకోనట్టు వదిలేసింది. ఎంత పుకారైనా సరే హైప్ పెంచడానికి పనికి వస్తోందని నిర్మాతలు మౌనం వహించారు. కట్ చేస్తే అది నిజంగానే బజ్ తీసుకొచ్చింది. చాలా మంది మెగా ఫ్యాన్స్ ఆ మాటలు నమ్మి బెనిఫిట్ షోలకు వెళ్లారు. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో తన హీరోలందరినీ కలిపే పనిలో ఉన్న కనగరాజ్ ఇందులో మాత్రం ఏ క్యామియో లేకుండా నిరాశ పరిచిన మాట వాస్తవం. విజయ్ తప్ప ఇంకెవరు కనిపించరు.
నిజానికి స్క్రీన్ మీద కొన్ని సెకండ్లు అయినా సరే ఇతర హీరో డామినేట్ చేయడం విజయ్ ఒప్పుకోడనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. అలాంటప్పుడు చరణ్ కు ఎస్ చెప్తాడని అనుకోలేం. ఖైదీ, విక్రమ్ ల నుంచి రెండు మూడు పాత్రలను తిరిగి తీసుకొచ్చిన లోకేష్ ఒక్క నెపోలియన్ కు మాత్రమే మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో లియో టాక్ ఏమంత ఆశాజనకంగా లేదు. అంచనాలు విపరీతం కావడంతో వాటిని అందుకోవడంలో తడబడినట్టు రిపోర్ట్స్, రివ్యూలు చెబుతున్నాయి. భగవంత్ కేసరికి మాస్ వర్గాల మద్దతు దక్కేలా ఉండటంతో లాంగ్ రన్ లియో మేజిక్ జరగడం అనుమానమే.
This post was last modified on October 19, 2023 7:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…