అనుకున్నదే అయింది. ఇప్పటికే 2023 సంక్రాంతికి మ్యాడ్ రష్ కనిపిస్తుండగా.. విజయ్ దేవరకొండ కూడా ఆ పండుగ రేసులోకి వచ్చేశాడు. అతడి కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్‌ను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విషయం అధికారికం అయింది. ఈ సినిమాకు అందరూ అనుకున్నట్లే ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఖరారు చేసి టీజర్ వదిలారు. ఆ టీజర్ ఆసక్తికరంగా సాగింది.
పద్ధతిగా ఫ్యామిలీని నడిపించే మధ్య తరగతి వ్యక్తి.. సెటిల్మెంట్‌లోకి దిగితే ఎలా ఉంటుందో ఈ టీజర్లో చూపించారు. టీజర్ షార్ట్ అండ్ స్వీట్‌గా సాగి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్‌తో విజయ్ చేసిన సినిమా కావడంతో దీనిపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండటం కూడా అంచనాలను పెంచేదే.
పాజిటివ్ ఫీల్ ఇచ్చిన టీజర్లో ఒక విశేషాన్ని సినీ ప్రియులు పట్టేశారు. టీజర్లో కొన్ని క్షణాలే కనిపించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ డ్రెస్.. సర్కారు వారి పాటలో ఒక సీన్లో హీరోయిన్ కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్‌కు డిట్టోలా ఉండటం విశేషం. ఇలా హీరోయిన్లు వేర్వేరు సినిమాల్లో ఒకే రకం డ్రెస్‌లు వేయడం అరుదు. చీరల్లో కలర్లు మ్యాచ్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ.. ఇలా సేమ్ డ్రెస్ వేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని చాలామంది అనుకోవట్లేదు. పరశురామ్ ఉద్దేశపూర్వకంగానే కథానాయికగా ఈ డ్రెస్ వేయించి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రేక్షకులను టీజ్ చేయడానికే ఇలా చేసి ఉండొచ్చు, లేదా క్యారెక్టర్లలో ఏదైనా కనెక్షన్ ఉంటే ఉండొచ్చు. ఈ మధ్య సినిమాటిక్ యూనివర్శ్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని కూడా ఆ కోణంలో చూస్తూ పెట్లావర్స్ అంటూ దీనికి నామకరణం చేసేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 19, 2023 10:15 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…