మాన్షన్ 24..డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లేటెస్ట్ సెన్సేషన్. టీవీ లో, సినిమాల్లో ఒక మార్క్ సృష్టించిన దర్శకుడు ఓంకార్ తొలిసారి చేసిన సిరీస్ ఇది. సెంటిమెంట్ కి సస్పెన్స్ కలిపి, దానికి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ మిక్స్ చేసి, అక్కడినుంచి కథని హారర్ వైపు మళ్లించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది “మాన్షన్ 24”.
ఓ పాడుబడిన మాన్షన్ లో.. ఏ క్షణం ఎలాంటి మనుషులు ఎదురవురుతారో, ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఎలాంటి గగుర్పొడిచే సన్నివేశాలు తారసపడతాయో తెలియని సస్పెన్స్ తో నడిచే ఈ కథ రకరకాల మనుషుల్ని, వాళ్ళలో ఊహించలేని కోణాల్ని మనకు పరిచయం చేస్తుంది. హారర్, థ్రిల్లర్ అంశాల మేలు కలయికగా రూపొందిన ఈ సిరీస్ సమపాళ్లలో అన్ని హ్యూమన్ ఎమోషన్స్ తో అలరిస్తోంది.
సీనియర్ నటులు సత్యరాజ్, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్, తులసి , రాజీవ్ కనకాల, అవికా గోర్, జయప్రకాశ్, బాహుబలి ప్రభాకర్, విద్యుల్లేఖ, అభినయ, అయ్యప్ప పి శర్మ, శ్రీమాన్ , బిందు మాధవి, నందు తదితరులు తమ ఇమేజిలతో సంబంధం లేని విలక్షణ పాత్రల్లో మెరిపించారు.
అంతుపట్టని మిస్టరీ ని, దాని వెనకాల వున్న ఒక భయంకరమైన నిజాన్ని ఛేదించడానికి ఒక అమ్మాయి చేసే ప్రయత్నాల్లో ఆమెకి ఎదురైన ఎన్నో భయంకరమైన అనుభవాలతో “మాన్షన్ 24” ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సరికొత్త నేపథ్యం, దాన్ని మ్యాచ్ చేసే కథాంశం “మాన్షన్ 24” సిరీస్ లో కొత్తదనం.
“మాన్షన్ 24” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/46x37pi
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates